April 15, 2025
SGSTV NEWS
CrimeNational

కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు



భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా  పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది.

వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరథంచారు.

Also read

Related posts

Share via