SGSTV NEWS online
Andhra PradeshCrime

హిజ్రాలు దాడి చేశారనే మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

గుణదల (పటమట): కొందరు హిజ్రాలు తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్న అవమాన భారంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధి గిరిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గిరిపురం జయరాజు వీధికి చెందిన యువకుడు పల్లెపోగు గోపీచంద్ రాడ్ బెండింగ్ పనులకు వెళ్తుంటారు. ఆయన ఓ యువతితో ప్రేమలో ఉన్నారు. కొంతకాలంగా గోపీచంద్ మద్యానికి బానిసై.. పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో ఆ యువతి ఆయనతో మాట్లాడడం మానేసింది.
ఈ క్రమంలో ఈ నెల 10న గోపీచంద్.. ఆమె ఇంటికి వెళ్లి తనతో మాట్లాడాలంటూ గొడవ చేశారు.  మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోపీచంద్.. యువతి మేనమామను చెంపపై కొట్టారు. అతని ఫిర్యాదు మేరకు గోపీచంద్ను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరువాత యువతి మేనమామ తనకు తెలిసిన హిజ్రా సరిత ఎలియాస్ డానియేలుతో పాటు మరో పది మంది హిజ్రాలను తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో యువకుడి ఇంటికి వెళ్లారు. గోపీచంద్ తల్లిదండ్రులు కుమార్బాబు, సత్యకుమారి (40)లపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన సత్యకుమారి ఫ్యాన్కు ఉరేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ వద్ద తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.

Also read

Related posts