ఇచ్ఛాపురం టౌన్(శ్రీకాకుళం):మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు.
అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు.

Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే