SGSTV NEWS online
CrimeNational

ఇంట్లోనే మహిళ హత్య

యశవంతపుర: బెంగళూరు కొడిగేహళ్లి భద్రప్ప లేఔట్‌కు చెందిన ఎస్‌. శోభ (48) అనే మహిళ హత్య మిస్టరీగా మారింది. ఆమె స్థానికంగా ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ను నడుపుతున్నారు. హర్షిత, సుప్రియ అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా వారికి పెళ్లి చేశారు. హర్షితకు ఈ నెల 4వ తేదీన పెళ్లి చేయగా ఆమె నగరంలోనే భర్త ఇంటికి వెళ్లిపోయింది.

శనివారం రాత్రి ఆమెకు హర్షిత ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చి చూడగా తల్లి రక్తపు మడుగులో శవమై ఉంది. దీంతో మరో కూతురు, భర్త వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త భార్య నుంచి విడిపోయి కూతురి ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది. ఇంట్లో బంగారు నగలు, కారు లేవని, ఎవరో తెలిసినవారే ఇంట్లోకి వచ్చినట్లు ఉందని కూతుర్లు చెబుతున్నారు. పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు

Also read

Related posts