తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.
ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు 2017 ఉత్తరప్రదేశ్ లోని బనారస్‌లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది.
ఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా మళ్లీ, తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్న్లో కుటుంబ కౌన్సెలింగ్ తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- 4 ఏళ్ల తర్వాత మళ్లీ బయటకొచ్చిన ర్యాగింగ్ భూతం.. జూనియర్స్ బట్టలు విప్పించి మరీ
- సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్‌చేస్తే యువతి..
- జలపాతంలో మునిగి ముగ్గురు గిరిజన యువతుల మృతి
- ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
- అమానుషం.. అంగన్వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?





