November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పైరవీ,బ్రొకరేజ్ చేస్తేనే రాష్ట్రస్థాయిలో చైర్మన్లు, నామినేట్ పదవులు ఇచ్చేస్తారా…??*

*తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పైరవీ,బ్రొకరేజ్ చేస్తేనే రాష్ట్రస్థాయిలో చైర్మన్లు, నామినేట్ పదవులు ఇచ్చేస్తారా…??*

నారా చంద్రబాబునాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు.

అయ్యా, మీకు ఎన్నోసార్లు కార్యకర్తలు విన్నపాలు చేశారు. ఆ విన్నపాలను పట్టించుకోరా..?? తమరి జాతీయ కార్యాలయంలో కొంతమంది కేవలం రాష్ట్రస్థాయి పదవుల కోసమే కులాల పేరుతో మతాల పేరుతో నాయకులుగా ఖద్దరు వేసుకొని కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్మిస్తూ, పార్టీ ఆఫీసుని నమ్మిస్తూ తిరిగే వారికి మాత్రమే రాష్ట్రస్థాయిలో పదవులు కట్టబెడతారా… రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆయా కులాలు, ఆయా మతాలను పార్టీకి అనుసంధానం చేసి పార్టీ పేరుతో ఉద్యమాలు చేసి, కార్యక్రమాలు నిర్వహించిన వారు మీకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడా కనపడరా, మా దగ్గర అందరి జాతకాలు ఉన్నాయని అధిష్టానం ప్రతిసారి చెబుతూ ఉంటుంది కానీ పదవులు కట్టబెట్టేటప్పటికీ మంగళగిరి కార్యాలయంలో ఉన్న మీ కోటరీలో ఉన్న వ్యక్తులకి, పాలిట్ బీరు లో ఉన్న కొంతమంది నాయకులకు రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, బ్లూ లేబులు వంటి కాస్ట్లీ మద్యాన్ని సరఫరా చేస్తూ,  రాత్రిపూట గెస్ట్ హౌస్ ల్లో బెడ్ షీట్లు మారుస్తూ ఉండే వ్యక్తులకి, పదవుల కోసమే పైరవీలు చేస్తూ మీ కోటరీలో వ్యక్తులను, పాలిటి బ్యూరోలో ఉన్న నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ వారి ద్వారా రాష్ట్రస్థాయి నామినేట్టు పదవుల కోసం మీ పరిశీలనలోకి రావడం కోసం ఇటువంటి బ్రోకరు, పైరవీకారులు రాష్ట్ర కార్యాలయంలో తిష్ట వేసుకుని కూర్చున్నరు. అటువంటి వారికే అత్యంత ప్రాధాన్యత అధినేతలగా మీరు ఇస్తారా…?? అటువంటి కొంతమంది బ్రోకర్లు, పైరవీకారులు బెడ్ షీటర్లు, కబ్జాకోర్లు, సమాజంలో ఆర్థిక నేరగాళ్లు, పార్టీ ఉద్యమాలకు సంబంధం లేని క్రిమినల్ కేసుల్లో ఉన్న నేరస్తులకు, సిబిఐ కేసుల్లో ఉన్న నేరస్తులకు ఈసారి పదవులు కట్టబెట్టబోతున్నారా..?? రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది… 2014 నుండి 2019 వరకు ఇలాంటి వారికే పదవులు కట్టబెట్టి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే చులకనకి గురై అధికారం కోల్పోయిందని ఇప్పటికి కూడా తమరు గుర్తెరగరా.. ఇటువంటి దొంగలు, లుచ్చాలు, ఆర్థిక నేరగాళ్లు, కబ్జాకోర్లు, పైరవీకారులు, బెడ్ షీటర్లు వంటి వారికి ఇచ్చిన పదవులతో సమాజంలో పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఓటర్లు ఏమీ భావిస్తారో, వారి వల్ల పార్టీకి ఓట్లు ఎలా, ఎందుకు పడతాయని కూడా కనీసం ఆలోచించరా..?? పోయినసారి చేసిన తప్పులనే మరలా మరల చేస్తారా..?? పదవులు తెచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో జరిగే గల్లీ టు ఢిల్లీ అనే నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీ అడాప్ట్ చేసుకుందా..?? నిజమైన కార్యకర్తల, నాయకుల రాజకీయ జీవితాలు నాశనం చేస్తున్న ఈ పైరవీకారులు, బ్రోకర్లు బెడ్ షీటర్లను, ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేసి సిబిఐ కేసులు విచారణ ఎదుర్కొంటు, దొంగ పాస్పోర్టులతో విదేశాలు పారిపోయి, అధికారం రాగానే ఇండియాకు ఎన్నారై లుగా వచ్చేసి తమరి చుట్టూ కొంతమంది చలామణి అవుతుంటే అటువంటివారిని ఎందుకు మంగళగిరి కార్యాలయంలో నియంత్రణ చేయలేకపోతున్నారు… ఏంటి ఆ బ్రహ్మ రహస్యం అనేది అధిష్టానానికే తెలియాలి. అధికారం లేనప్పుడు ఇదే అధినేతల ప్రసంగాల్లో మటుకు కార్యకర్తల రుణం తీర్చుకోలేమని , నిజమైన నిబద్ధత కలిగిన పార్టీ శ్రేణుల త్యాగాలను మరవలేం, అధికారం రాగానే అండగా ఉంటాం, వారిని బాగా గుర్తిస్తాం, పార్టీలో వారిని ఉన్నత స్థితికి తీసుకు వెళ్తాం అంటూ ప్రతి సమావేశంలో ప్రసంగాలన్నీ కేవలం ఊకదంపుడేనా…?? మనం ఎవరికైతే పదవులు ఇవ్వాలనుకుంటున్నామో వారి వ్యక్తిగత జీవితం ఏంటి, సమాజంలో వారి కున్న గుర్తింపు ఏంటి అనేది పట్టించుకోకుండా కేవలం నామినేటెడ్ పదవుల కోసం మాత్రమే మంగళగిరి కార్యాలయం చుట్టూ (కొంతమంది మాత్రమే) దొంగలు, లోఫర్లు, ఆర్థిక నేరగాళ్లు, కద్ధర్ వేసే నకిలీ నాయకులను మాత్రమే అధికారంలో వున్న మన పార్టీ అధిష్టానం గుర్తిస్తుందా, గుర్తించదా అనేది 2024 నుంచి 29 వరకు జరిగే పార్టీ పరిణామ క్రమంలో తేలబోతుంది. పదవులు ఇచ్చేటప్పుడు అధిష్టానంగా మనం ఎవరికి పదవులు కట్టబెడుతున్నాము అనే కనీసం విచారణ కూడా వారి గురించి చేయకుండా ఇచ్చేస్తారా… తెలిసో, తెలియకో తప్పు చేసేస్తారా… దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆలోచన చేయరా… ఎంత మాత్రం మనం అధికారంలో ఉంటే వాస్తవాల్ని గుర్తు ఎరగకుండా నిజమైన నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేస్తారా.., సొంత ఇంటిని నమ్ముకున్న వాడికి న్యాయం చేయరా… పదవుల కోసం పార్టీల మారి అద్దె ఇంట్లో వాళ్లకి న్యాయం చేస్తారా… పూర్వంలో ఒక సామెత మాదిరి దొంగలకు కూడు వండి పెడతారా…. అధికారం లేనప్పుడు కార్యకర్తల భజన, అధికారం రాగానే నకిలీ నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో… అన్నగారు స్థాపించిన ఏమి దౌర్భాగ్యం పట్టిందో తెలుగుదేశం పార్టీకి అని సగటు కార్యకర్తలు,నాయకులు నియోజకవర్గ జిల్లా స్థాయిలో చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఈ సగటు కార్యకర్తలు,నాయకులు తమకు జరిగిన అన్యాయానికి తమ ప్రతాపాన్ని పార్టీకి ఏ విధంగా చూపించారో గుర్తేరగాల్సిందిగా, లేనిపక్షంలో ఐదేళ్లు కాలం అనేది గిర్రున తిరగడానికి ఎంతో సమయం పట్టదు… ఈ పైరవీకారులు, బ్రోకర్లు అధిష్టానానికి బాగా నచ్చి ఉంటే, పోలిట్ బ్యూరోలో కొంతమంది  నాయకులకి కూడా రెడ్,గ్రీన్,బ్లూ🍾🥃, నచ్చి ఉంటే వారి సేవలను పార్టీలో ఇంకో రకంగా వినియోగించుకోవాల్సిందిగా, అటువంటి వారి కోసం పార్టీలోకి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులను ఒక 20 ఏళ్ల పాటు కనీసం పార్టీలో పని చేయించుకొని పదవులు ఇవ్వాలని, పార్టీ పరంగా ఇటువంటి ఆల్ పార్టీ  పైరవి, బ్రోకర్, బెడ్ షీట్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వాటిలో వారికి అత్యున్నత పదవులు ఇవ్వాలని, అటువంటి వారి వల్ల క్షేత్రస్థాయిలో సగటు కార్యకర్తకు అన్యాయం జరగకుండా, పార్టీయే జీవితం, పార్టీయే ఆశ, శ్వాస, పార్టీయే తన కుటుంబం అని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తల,నాయకుల ఉసురు పోసుకోకుండా, వివిధ కులాలు, మతాల్లో పార్టీకి పనికి వచ్చే వారెవరు, వారి సేవలను అధికారంలో ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలి అనే ఆలోచనతో క్షేత్రస్థాయిలో ఈసారన్న అటువంటి నిజమైన లీడర్లు ఎవరో తెలుసుకొని న్యాయం చేస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సమావేశాల్లో కార్యకర్తల పార్టీ శ్రేణులు పట్ల మాట్లాడిన ప్రసంగాలను నిజం చేసుకోవాల్సిందిగా ఎన్నికల అప్పుడు ఓట్లు వేయించగలిగె సత్తా కలిగి, ఓటర్లు కూడా నమ్మే సగటు తెలుగుదేశం నాయకుల, కార్యకర్తల మనోవేదన, మనోభావం ఇది. పార్టీ శ్రేణుల మనోభావాలకు దెబ్బ తగలకుండా చూసుకోవాలని అధిష్టానాన్ని ప్రార్థిస్తూ…
🙏🙏🙏🙏🙏🙏

*నిజమైన కార్యకర్త*
🚲తెలుగుదేశం పార్టీ✌️

Also read

Related posts

Share via