ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుదామనుకున్న ఓ 67 ఏళ్ల వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. అమెరికాలోని సియాటెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. అమెరికాలోని సియాటెల్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారుపై లైంగిక దాడికి పాల్పడదామని స్థానిక హోటల్‌లోకి దిగినట్ల సమాచారం అందింది. అయితే అప్పటికే ఈ వ్యవహారంపై సియాటెల్ పోలిసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు.
అందులో భాగంగా ప్రక్కా సమాచారం అందటంతో ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు అనుమానిత వ్యక్తిని రూం డోర్ తెరవాల్సిందిగా కోరారు. రూం డోర్ తీసిన వ్యక్తి పోలిసులను చూసి వారి చేతిలో ఉన్న తుపాకి లాక్కోని పారిపోవడానికి ప్రత్నించాడు. ఇలా ఒక పోలీసుతో పెనుగులాట జరుగుతున్న సమయంలో మరో పోలిసు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాడు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బాడీ కెమెరా ద్వారా ఈ ఘటన దృశ్యాల వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు చిన్నారుల్లో ఒకరిది 7, మరొకరిది 11 ఏళ్ల వయసు ఉంటుందని పోలిసులు గుర్తించారు.
ఈ ఘటనపై సియాటెల్ పోలీసు విభాగం చీఫ్ అడ్రియన్ డియాజ్ స్పందిస్తూ.. చిన్నారులపై జరిగే ఇంటర్‌నెట్ నేరాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 2022 నుంచ 2023 వరకు ఈ నేరాల సంఖ్య 67 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. ఇటువంటి కేసులను ఛేదించే క్రమంలో పోలీసుల ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారని అన్నారు
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య