నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు.
మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్ కు విషయం తెలిపింది.
శుక్రవారం రాత్రి విఠల్ (మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్స్టేషన్ సమీపంలో బాన్సువాడ-బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!