మహబూబాబాద్ : ఓ భార్య.. తన భర్తకు దగ్గరుండి మరో మహిళతో పెళ్లి చేసింది. ఈ విచిత్ర సంఘటన తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గూడూరు గ్రామానికి చెందిన సురేష్, సరితలకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి సంసారం హాయిగానే గడచిపోతుంది. ఈ క్రమంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ, వీరాస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్‌ని తనకు ఊహ తెలిసినప్పటి నుండే ప్రేమిస్తుంది. ఈ విషయం సురేష్ భార్య సరితకి తెలిసింది. సంధ్య మానసిక వికలాంగురాలు. సంధ్య మనసుని సరిత అర్థం చేసుకుంది. సంధ్యకు, తన భర్తకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. సంధ్యకి, సురేష్‌కి జరగబోయే పెళ్లికి సరితే బంధువులను ఆహ్వానించింది. బంధువులందరి సమక్షంలో భర్తకు మార్కండేయ దేవాయలంలో రెండో పెళ్లి చేసింది.

భార్యే దగ్గరుండి భర్తకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారందరూ సరితని మెచ్చుకుంటున్నారు. సరిత పెళ్లి చేయడమే కాదండోరు.. సంధ్యది చిన్న పిల్లల మనస్తత్వమని, తనని కూడా పసిపిల్లలానే చూసుకోవాలని భర్తను కోరింది. ప్రస్తుతం ఈ వివాహం ట్రెండింగ్ టాపిక్ అయింది.
తాజా వార్తలు చదవండి
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





