శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమ.. దేన్నైనా ఎదిరిస్తుంది. ప్రేమ.. ఏదైనా చెయ్యిస్తుంది. ప్రేమ.. నచ్చిన వారికోసం ఎంత దూరం అయినా వెళ్లేలా చేస్తుంది. అలాంటి ప్రేమ నూటికో.. కోటికో కొందరికి మాత్రమే దొరుకుతుంది. అలాంటి ప్రేమను పొందిన ఒక జంట తాజాగా ప్రాణాలు కోల్పోయింది. భర్త మృతి చెందిన అతి కొద్ది గంటల్లోనే భార్య మనస్సు విలవిల్లాడిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా తరుక్కుపోయింది.
ఇన్నేళ్లు తనతో కలిసి జీవించిన భర్త తనతో ఇక ఉండడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. భర్త లేకుండా తాను ఉండలేననుకుంది. దీంతో భర్త లేని జీవితం తనకు వద్దనుకుని తానుకూడా చనువు చాలించింది. ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
భర్తకు గుండెపోటు
శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు (సోమవారం) ఉదయం పొలం పనుల కోసం పొలం దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక ఇలా వచ్చీ రాగానే ఒకసారిగా ఇంట్లో అస్వస్థకు గురై పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు.
ఈ క్రమంలో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం తిమ్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో భర్త మరణ వార్త విన్న భార్య భాగ్యమ్మ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. దీంతో భర్తలేని తాను బతకలేను అని అనుకుంది.
దీంతో మనస్థాపనికి గురై ఇంటి ఆవరణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. భార్య భర్తలు చనిపోవడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లినాటి నుండి గ్రామంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం కొనసాగించారని.. కానీ వీరి మరణ వార్త గ్రామానికి చాలా బాధాకరమని గ్రామస్తులు తెలిపారు.
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి