పల్నాడు జిల్లా దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పల్నాడు జిల్లా(Palnadu District) దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం  భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే..  సత్తెనపల్లి మండలం ఫణిదం అనే గ్రామంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి భార్య, కొడుకుతో ఉంటున్నాడు. అయితే ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్ల అనే వ్యక్తికి అతడు రూ.50 వేలు అప్పు ఇచ్చారు. గత కొన్నిరోజులుగా అప్పు డబ్బులు అడుగుతున్నా కూడా వెంకటేశ్వర్లు ఇవ్వడం లేదు.   
దీంతో మంగళవారం వెంకటేశ్వర్ల ఇంటికి శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కొడుకు వెంకటేశ్ వెళ్లారు. అప్పు చెల్లించాలంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తాను అప్పు చెల్లించలేనని వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగేశాడు. దీంతో పూర్ణకుమారి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు చెప్పింది. వెంకటేశ్వర్లు ప్రాణానికి అపాయం ఉంటుందేమోనని శ్రీనివాసరావు కుటుంబం తీవ్రంగా ఒత్తిడికి గురైంది. 
వెంకటేశ్వర్లు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాసరావు పురుగుల మందు తాగాడు. చివరికి భార్య పూర్ణకుమారి, కొడుకు వెంకటేశ్‌తో కలిసి బావిలో దూకి సూసైడ్(wife-and-son-commits-suicide) చేసుకున్నారు. పూర్ణకుమారి మృతదేహం దొరికింది. వెంకటేశ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పురుగుల మందు తాగిన శ్రీనివాసరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





