శ్లో: జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
బ్రాహ్మణ్యం’ కుల సంకేత పదం కాదు. గుణ సంకేత పదం. ధార్మిక లక్షణాలు, ధర్మ గుణపరాయణులందరూ బ్రాహ్మణులే. బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణ: అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు. పురమునకు హితము కోరేవాడు పురోహితుడు అంటారు. పురము అనగా ఊరు , హితము అంటే మేలు తలచేడివాడు పురోహితుడుగా పిలవబడుతాడు, ఇతడు ధర్మ శాస్త్ర ప్రియుడు ( తెలిసినవాడు )
పురోహితము :-
పు :- అనగా పుర జనులందరికి
రో :- అనగా రోజురోజుకి
హి :- అనగా హితము చెప్పుచు
త :-అనగా తరింపజేసి
ము :- అనగా ముదము గూర్చునది.
ప్రతి మనిషి పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును.
* పురోహితుడు అనగా హితము పలికెడివాడు
* పురోహితుడు అనగా ధర్మార్థ కామమోక్షములకు సోపానము
* పురోహితుడు అనగా పూజనీయుడు
* పురోహితుడు అనగా సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారు పేరు
* పురోహితుడు అనగా నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
* పురోహితుడు అనగా బహు భార్యత్వం కలిగి ఉండరాదు
* పురోహితుడు అనగా స్త్రీల వంక నిషిదంగా చూడకూడదు
* పురోహితుడు అనగా ఏ విషయంలోనైనా కోపాన్ని ప్రదర్శించ కూడదు
* పురోహితుడు అనగా ధనాన్ని, సుఖాలను అభిలాశించకూడదు
* పురోహితుడు అనగా వడ్డీ వ్యాపారాలు చేయకూడదు
* పురోహితుడు అనగా తనకు వచ్చిన దానాలను తిరిగి పేదలకు దానం చేయువాడు
* పురోహితుడు అనగా పిలక లేకుండా ఉండకూడదు.
* పురోహితుడు అనగాజన హితం కోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి
* పురోహితుడు అనగా కపటవైఖరిగా, స్వార్థంతో జీవనం ఉండకూడదు
* పురోహితుడు అనగా ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
* పురోహితుడు అనగా హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
* పురోహితుడు అనగా ఏ వ్యాపారం చేయకూడదు
* పురోహితుడు అనగా సాధారణమైన పేరు వశిష్ఠుడు
* పురోహితుడు అనగా మానసిక వ్యాధిని ఛేదించే సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
* పురోహితుడు అనగా ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
* పురోహితుడు అనగా సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
* పురోహితుడు అనగా తను జ్ఞానంతో ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
* పురోహితుడు అనగా భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి
* పురోహితుడు అనగా భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
* పురోహితుడు అనగా శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
* పురోహితుడు అనగా నిత్య కాలగణన చేయు గణితవేత్త
* పురోహితుడు అనగా గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
* పురోహితుడు అనగా ఏ కోరికలు ఉండ కూడదు
* పురోహితుడు అనగా తన మనస్సు, మాట, శరీరం, పని, లోక హితార్ధమై ఉండాలి
* పురోహితుడు అనగా పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి. జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞ సమిదల వృక్షాలు, ఫల పుష్పాది వృక్షాలు, ఓషధి వృక్షాలు మొదలగు వాటిని ప్రతిష్టించి, పెంచి పోషించుమని జనులకు ( ప్రజలకు ) ప్రోత్సహించువాడు. సర్వవేళల యందు సదాచారంతో ఉండ గలిగినవాడు, నిస్వార్ది, సాత్వికుడినే పురోహితుడు అనబడుతాడు. బ్రాహ్మణులుగా పుట్టడం గొప్పకాదు. బ్రాహ్మణులుగా జీవించడం గొప్ప. ఈ విషయాలన్నీ ప్రాచీన తాళపత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం ఆచార, ధర్మములు – ఆలోచనలు అనే గ్రంధం నుండి సేకరించినది.