November 22, 2024
SGSTV NEWS
Spiritual

యక్షులు ఎవరు? వారు సూర్యాస్తమయం తరువాతే ఎందుకు నదీ స్నానానికి వస్తారు?




హిందువులకు పవిత్ర నదులలో స్నానం చేయడం సాంప్రదాయంగా వస్తుంది. అలా చేయడం వల్ల పాపాలన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని చెప్పుకుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఎవరు నదీ స్నానం చేయరు.

యక్షులు ఎవరు?


River Bath: పవిత్ర నదులలో స్నానం చేయడం హిందువులకు ప్రాచీన సాంప్రదాయం. గంగా, యమునా, సరస్వతీ, గోదావరి నదులను దేవతలతో సమానంగా పూజిస్తారు. వాటికి ఎంతో గౌరవం ఉంటుంది. హిందువులకు అవి కేవలం నదులే కాదు… సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ప్రజలు ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి ఎంతో దూరం నుంచి వస్తారు. తమ పాపాలను విముక్తి చేసుకోవడానికి మనసును శుద్ధి చేసుకోవడానికి ఆ నదుల్లో స్నానం చేయాలని అనుకుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఎవరూ పవిత్ర నదుల్లో స్నానం చేసేందుకు ప్రయత్నించరు. అలా చేయడం పాపమని అంటారు

హరిద్వార్, రిషికేష్ వెళ్ళిన వారు ఎవరైనా కూడా గంగానదిలో స్నానం చేసే వస్తారు. గంగానదిని తల్లిగా భావిస్తారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని మోక్షం లభిస్తుందని అంటారు. సంక్రాంతి, కుంభమేళా వంటి పండగల సమయంలో లక్షలాదిమంది గంగా నదుల స్నానం చేయడానికి వెళ్తారు.

ఎందుకు స్నానం చేయకూడదు?
సూర్యాస్తమయం తర్వాత నదీ స్నానం చేయడం తప్పుడు పద్ధతని చెబుతున్నారు పురోహితులు. పురాతన కాలంనాటి ఋషులు కూడా సూర్యాస్తమయం తర్వాత నదీ స్నానం చేసేవారు కాదట. ఇతిహాసాలు చెబుతున్న ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల దుష్టశక్తుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. యక్షులు స్నానం చేసి ఈ పవిత్ర నదుల దగ్గరే రాత్రిపూట కూర్చుంటారని చెబుతారు. యక్షులు దుష్ట ఆత్మలు కాదు, కానీ నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో ముడిపడి ఉన్న ప్రకృతి పరమైన ఆత్మలు. ఈ జీవులు కేవలం రాత్రి సమయాల్లోనే చురుకుగా తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలోనే అవి నదీ స్నానానికి వస్తాయి. అవి నదీ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రజలు నదీ స్నానం చేయడం వాటిని అగౌరవపరచడమేనని అంటారు.

నదీ స్నానం ఎప్పుడు చేయాలి?
ఇప్పుడు పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సమయాన్ని నిర్ణయించుకుంటున్నారు. కానీ పవిత్ర నదుల్లో స్నానం చేయాల్సిన సరైన సమయం బ్రహ్మ ముహూర్తంలోని తెల్లవారుజాము. మనుషుల్లో నదుల్లో పవిత్ర స్నానం చేయడానికి ఉత్తమ సమయంగా ఋషులు కూడా చెప్పేవారు. ఆ సమయంలోనే ఆధ్యాత్మిక శక్తి ఉచ్చ స్థితిలో ఉంటుందని, అందరూ నమ్ముతారు. పూజారులు కూడా సూర్యాస్తమయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేసి గుడిలో హారతి పడతారు.

కాబట్టి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం తర్వాత నదీ స్నానాలు చేసేందుకు ప్రయత్నించకండి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుంది. మోక్షం త్వరగా సిద్ధిస్తుంది.

Also read

Related posts

Share via