November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఉచిత ఇసుక ఎక్కడ…?….. గ్రీష్మ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి.ఐ.యఫ్.టి.యు .


         నిడదవోలు మండలం పెండ్యాల లో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా కార్మిక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
            ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు ఉచిత ఇసుక విధానం తెస్తామని హామీ ఇచ్చి ప్రజలు ఓట్లు కొల్లగొట్టార నీ, అధికారం చేపట్టి 4 నెలలైనా దాటవేత ధోరణి అవలంబిస్తూ న్నారనీ, గత ప్రభుత్వం ఇసుక, సిమెంట్,ఐరన్, మెంటల్ తదితర నిర్మాణ సామగ్రి అధిక ధరల  ద్వారా ఒకరకంగా ఇబ్బంది పెడితే ప్రస్తుత ప్రభుత్వం ఇసుక అసలే లేకుండా చేసి మొత్తం నిర్మాణ రంగాన్ని అధోగతి పాలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి కార్మికుల ఉసురు తీస్తోందన్నారు. తక్షణమే తమ ఎన్నికల హామీ నిలబెట్టుకొని ఉచిత ఇసుక ప్రజలకు సరఫరా చెయ్యాలని, గత  ప్రభుత్వం మొదలు పెట్టిన కాలనీల నిర్మాణాలకు నిధుల విడుదల ద్వారా ఇళ్ళు పూర్తి అయ్యెందుకు సహకరించి కార్మికుల ఉపాధి కాపాడాలని డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ, సెక్రటరీ కారింకి రమేష్, వాకా రాంబాబు, వెలిగిపోతోంది వెంకటేశ్వరరావు, మిద్దె రాంబాబు, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, చిన్న చిల్లి నాగరాజు, వెలిగట్ల సురేష్ తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via