రంగారెడ్డి జిల్లా: తన కూతురు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళుతుందనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఆ కుటుంబం కలలు కళ్ళెదుటనే కరిగి పోయాయి. మృత్యు రూపంలో వచ్చిన ఓ కారు వారి ఆశలను చిదిమి వేసింది. రోడ్డును దాటుతున్న తండ్రీ,కూతురును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి తీవ్రంగా గాయడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కౌడిపల్లికి చెందిన యంసాని పాండ కళ్యాణిలు హయత్‌నగర్‌లోని వినాయకనగర్ కాలనీ ఉంటున్నారు. పాండు హయత్‌నగర్‌లో ఓ ట్రాన్స్పో కార్యాలయంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. వారికి కుమారుడా వంశి, కూతురు ఐశ్వర్య(19) ఉన్నారు. కొడుకు కెనడాలో ఉండ కూతురు మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల౬ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశా హస్టల్లో ఉంటున్న ఆమె ప్రతి శనివారం ఇంటికి వచ్చేది.
సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బస్సెక్కించేందు తండ్రికూతురును వెంట బెట్టుకుని రాగా హయత్‌నగర్ ఆర్టీ కాలనీలో ఇద్దరు జాతీయ రహదారిపై రోడ్డును దాటుతున్నాడ అదే సమయంలో ఎల్బీనగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన క్రెట కారు (టీఎస్ 07కెజి 9006) వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రం గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. కాలికి తీ గాయం అయిన తండ్రిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లో నీలాద్రి ఆసుపత్రిలో చేరపంచారు. ఈ మేరకు పోలీసులు కే నమోధు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..
- అమానుషం.. అంగన్వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే?
- హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!
- పైలట్ అవుదామని కోటి ఆశలతో హైదరాబాద్‌కు.. ట్యూటర్ చేసిన దారుణంతో..
- చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడి





