కరోనా సమయంలో మాజీమంత్రి కొడాలి నాని అండతో గడ్డం గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. దొరికిన చోటల్లా ..
కరోనా సమయంలో మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) అండతో గడ్డం గ్యాంగ్ (Kodali Gaddam Gang) చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. దొరికిన చోటల్లా కబ్జాలు చేసి గుడివాడలో భయానక వాతావరణం సృష్టించారు. మండలంలోని వలివర్తిపాడులోని రీసర్వే నెంబరు 180లోని చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలో 66 మంది ప్లాట్లను గడ్డం గ్యాంగ్ ద్వారా నాని కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కౌంటింగ్ వరకు ఆక్రమిత ప్రాంతంలో నాలుగు పక్కల షెడ్లను ఏర్పాటు చేసుకుని, చుట్టూ గేట్లు పెట్టి కాపలా కాసేవారు. సదరు ప్లాట్లలో పగులు, రాత్రి తేడా లేకుండా షిఫ్ట్‌లవారీగా మందు, విందులతో గడ్డం గ్యాంగ్ రచ్చరచ్చ చేసేవారు. ఎవరైనా ప్లాట్లవైపు వస్తే దాడులు చేసేవారు. వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ నేతృత్వంలో గడ్డం గ్యాంగ్‌తో పాటు రౌడీమూక రెచ్చిపోయింది. తన ప్లాట్‌ను చూసుకునేందుకు వెళ్లిన వ్యక్తిపై దాడి చేసింది. తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను కనీసం చూడటానికి కూడా వెళ్లకుండా అరాచకం సృష్టించారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర
గడ్డం గ్యాంగ్ అరాచకాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసినా గుడివాడ పోలీసులు పట్టించుకోలేదు. ఎన్ని అరాచకాలు, కబ్జాలు, లూటీలు జరిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారితో ఎందుకు సర్దుకుపోవాలని ఉచిత సలహాలు సైతం ఇచ్చారు. ప్లాట్ల ఆక్రమణ, దాడి విషయంలో తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనా దర్యాప్తు ఇంచు కూడా ముందుకు సాగలేదు. కనీసం దాడికి పాల్పడిన వ్యక్తులెవరో కూడా విచారణ చేపట్టలేదు. ఎక్కడి వేసిన గొంగడి అక్కడే మాదిరిగా కేసు నిలిచిపోయింది. ప్లాట్ల యజమానులకు మద్దతుగా టీడీపీ నాయకులు పోరాడారు.
కనుమరుగు!
ఇటీవల జరిగిన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో గడ్డం గ్యాంగ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందే గడ్డం గ్యాంగ్ పెట్టేబేడా సర్దుకుంది. కొడాలి నాని ఘోర ఓటమితో గడ్డం గ్యాంగ్ కనుమరుగైంది. వారు ఆక్రమించిన షెడ్లను ఖాళీ చేశారు. ఈ షెడ్ల మీదుగా తమ ప్లాట్లకు వెళ్లేవారు ఇప్పుడు ఆనందంగా వెళుతున్నారు.
టీడీపీ విజయంతో పరార్
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి, గుడివాడలో టీడీపీ అభ్యర్థి గెలవడంతో గడ్డం గ్యాంగ్ పరారైంది. నాని ఘోర ఓటమితో గడ్డం గ్యాంగ్‌లో భయం మొదలైంది. గుట్టుచప్పుడు కాకుండా షెడ్లను తొలగించారు. సామాన్లు సర్దేశారు. కౌంటింగ్ రోజు నానీతో పాటు ఇద్దరు గడ్డం గ్యాంగ్ సభ్యులు పరారయ్యారు. ఎక్కడ ఉన్నది తెలియలేదు.
ప్లాట్లను స్వాధీనం చేసుకుంటాం
ఇన్నాళ్లూ తమ ప్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని, టీడీపీ రాకతో ఆనందంగా ఉందని చైతన్య హౌసింగ్ సొసైటీ సభ్యులు తెలుపుతున్నారు. కష్టించి కొనుక్కున్న స్థలాలను ఆక్రమించారని అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెవెన్యూ, పోలీసులైతే వారితో ఎందుకు.. సర్దుకుపోవాలని ఉచిత సలహాలిచ్చారని వారు గుర్తు చేసుకున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం