West Godavari Crime: పచ్చని కాపురాల్లో
సోషల్‌మీడియా చిచ్చు పెడుతోంది. సరదాగా ఇంస్టాగ్రామ్ లో పరిచయం, ఆ తర్వాత వారి వారి కాపురాలను కూల్చుతోంది. వాటి ద్వారా ఒక్కటైన జంట.. కలకాలం జీవించిన సందర్భాలు కనిపించలేదు. ఫలితంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి వెస్ట్ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లాకు చెందిన మావుళ్లయ్యకు కొన్ని నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన రమతో పరిచయం ఏర్పడింది. మావుళ్లయ్యకు వయస్సు 25 ఏళ్లు, ఉంగుటూరులో చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లేవాడు.
రమ్య వయస్సు 34 ఏళ్లు. ఆమెకి వివాహం జరిగింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్‌స్టా ప్రియుడిలో ఏం నచ్చిందో తెలీదుగానీ అతడితో వెళ్లిపోయాలని డిసైడ్ అయ్యింది. భర్త, పిల్లలను వదిలేసి ఉంగుటూరు మండలం యర్రమళ్ళ వచ్చేసింది రమ. మావుళ్లయ్యను వివాహం చేసుకుని మరో గ్రామంలో కాపురం పెట్టింది.
ఇంస్టాగ్రామ్ లవ్.. ప్రియుడి కోసం పారిపోయిన వివాహిత, ఆపై పెళ్లి
రమ విషయం తెలుసుకున్న ఆమె భర్త, బంధువులు ఉంగుటూరుకు వచ్చారు. రమకు నచ్చజెప్పి తమతో తీసుకెళ్లిపోయాడు తొలి భర్త. మార్చి 24న మావులయ్య కోసం మళ్లీ ఉంగుటూరు వచ్చేసింది రమ. తాను అక్కడ ఉండలేదని, నీతో జీవితం పంచుకుంటానని తెగేసి చెప్పేసింది. రమ్య తొలి భర్త, బంధువులు మళ్లీ వచ్చి నిలదీశారు. తీవ్రమనస్తాపంతో ప్రియుడితో కలిసి ఆత్మహత్య పాల్పడింది.
ఏలూరు కాలువలో దూకి ఇంస్టాగ్రామ్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు తన బంధువు సతీష్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు మావుళ్ళయ్య. వెంటనే ఏలూరు కాలువ వద్దకు వచ్చి గాలించారు. రమ-మావులయ్య కనిపించకపోవడంతో చేబ్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చాడు సతీష్.
కేసు నమోదు చేసిన పోలీసులు, ఏలూరు కాలువలో గాలింపు చేపట్టారు. చివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి బంధువులకు కబురు పెట్టారు. మొత్తానికి ఇన్‌స్టా లవ్.. రమతోపాటు మావుళ్లయ్య జీవితంగా అర్థాంతరంగా ముగిసిపోయింది.
Also read
- West Godavari Crime:ఇంస్టాగ్రామ్ లో లవ్
ప్రియుడి కోసం పారిపోయిన వివాహిత, వారిద్దరి జీవితాలు చివరకు.. - Attack on RRR:ఆకివీడు లో రఘురామపై దాడి యత్నం.. జనసేన నేత తలలోకి దిగిన మేకులు.. ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సహకరించకపోతే జీవితం నాశనం చేస్తా..!
- గిరిజన బాలిక అనుమానాస్పద మృతి





