*దెందులూరు/31.03.2024/ పత్రికా ప్రకటన*
– *”3పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తాం – ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ,3 పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపిస్తాం”: మీడియా సమావేశంలో దెందులూరు నియోజకవర్గ NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ స్పష్టీకరణ*
– *ఏలూరులోని NDA కూటమి ఏలూరు ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్*
—–
ఏలూరు,మార్చ్31: రాబోయే సార్వత్రిక ఎన్నికలలో NDA కూటమిలో భాగస్వాములైన టిడిపి జనసేన బిజెపి పార్టీల సమన్వయంతో సమిష్టిగా కృషి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ,3 పార్లమెంట్ నియోజక వర్గాల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచి చూపిస్తామని టిడిపి జనసేన బిజెపి కూటమి దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఏలూరు శాంతినగర్ లోని పార్లమెంట్ నియోజక వర్గ కార్యాలయంలో NDA కూటమి ఏలూరు లోక్ సభ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్దులు, ఇంచార్జీల ఆత్మీయ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.
దెందులూరు నియోజకవర్గం సహా ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల్లో రాబోయే ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన పలు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7నియోజక వర్గాల్లోనూ రోజుకి ఒక నియోజక వర్గంలో ఎంపి అభ్యర్థి అయిన పుట్టా మహేష్ యాదవ్ పరిచయ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని, ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గం పరిధిలోని టిడిపి జనసేన బిజెపి పార్టీలకు చెందిన క్షేత్ర స్థాయి కార్యకర్తల నుంచి నియోజక వర్గ ఇంచార్జీల వరకు అందరూ పాల్గొంటారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జగన్ పాలనలోని దురాగతాలను, వైసిపి వైఫల్యాలను గ్రామ స్థాయిలో సైతం వివరించేలాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కూటమి ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, మాజీ మంత్రి మరడాని రంగారావు, జనసేన దెందులూరు నియోజక వర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు నియోజకవర్గ మండల పార్టీల అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, సహా టిడిపి జనసేన బిజెపి కూటమికి చెందిన పలు నియోజక వర్గాల అభ్యర్దులు, ఇంచార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
********
ఇట్లు
మీడియా కోర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!