బద్వేల్ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని అరెస్ట్ చేసాం.చనిపోక ముందు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో యువతి దగ్గర వాంగ్మూలం తీసుకున్నాం. ఇద్దరికీ కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఒకే ప్రాంతం వాళ్ళు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ళు తరువాత విడిపోయారు, స్నేహితులుగా ఉంటున్నారు. 6 నెలల క్రితం మరో యువతిని విఘ్నేష్ పెళ్లి చేసుకున్నాడు. నిన్న మాట్లాడుకుందామని యువతిని విఘ్నేష్ రమ్మని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఘటన జరిగిన ప్రాంతానికి ఆటోలో వెళ్లారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తర్వాత యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మధ్యాహ్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడు హత్య చేశాడు. అన్ని ఆధారాలతో త్వరగా దర్యాప్తు ముగించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేసి, కఠిన శిక్షలు పడేలా చేస్తాం : కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు…
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025