సారీ.. సిబ్బంది లేరు స్టేషన్కు తీసుకొచ్చి అప్పగించండి. ఇదీ గూడూరు పోలీసుల తీరు
నెల్లూరు జిల్లా: సారీ.. మా స్టేషన్ లో సిబ్బంది లేరు స్టేషన్ కు తీసుకొచ్చి అప్పగించండి అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు.
ఈ ఘటన గూడూరు పట్టణంలో బుధవారం వేకువ జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ నడి బోడ్డులోని చర్చి కాంపౌండ్ లో ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా యజమానికి మెలుకువ వచ్చి అతన్ని పట్టుకుని నిలదీస్తే అతను గంజాయి మత్తులో ఉన్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసాల్లోని వారు చేరుకుని అతని నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో మాట్లాడుతూ హల్చల్ చేయడంతో స్థానికులు 100కు డయల్ చేశారు.
కంట్రోల్ రూమ్ నుంచి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు అరగంట తరువాత ఫోన్ చేసి ఏమి జరిగిందనే విషయం అడిగి తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నాం, మీరు వచ్చి తీసుకుని వెళ్లండని పోలీసులకు తెలియజేస్తే స్టేషన్లో సిబ్బంది లేరు, అందరూ బందోబస్తుకు వెళ్లి ఉన్నారు. కాబట్టి మీరే అతన్ని స్టేషన్ కు తీసుకొచ్చి అప్పగించండని చెప్పారు. దీంతో అపరిచిత వ్యక్తిని చర్చి కాంపౌండ్ వాసులు బజారులో వదలి వేశారు. ఇలా అపరిచితులు ఇష్టానుసారంగా పట్టణంలో సంచరిస్తుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also read
- ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
- దొంగను పట్టుకున్నాం సార్! అయితే స్టేషన్ లో దింపేసి వెళ్లండి.
- WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!
- కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
- ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!





