April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!


ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మార్టూరు జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న 7గురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్(32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలలో మృతుల సంఖ్యను నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా తగ్గడం లేదు.

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
తాజాగా ఏపీలోని బాపట్ల జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. మార్టూరు జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 7గురు మిత్రులు విహార యాత్రకు వెళ్ళి కారులో తిరిగి వైజాగ్ వైపు వెళుతుండగా ముందు టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారు సైడు భాగం నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న ఏడుగురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్ (32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కారులోని ఫ్రంట్ సిట్టింగ్‌లో ఉన్న బెలూన్లు తెరుచుకోవడతో అధిక ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. కాగా వీరంతా మార్చి 9న తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాలు పర్యటించారు

ఈ ప్రమాదం జరిగిన అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను మార్టూరు, చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఇక గాయపడిన వారిలో గుంటూరు వాసులు కొంతమంది ఉన్నట్లు సమాచారం

Also read

Related posts

Share via