SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు


విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్ లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.

తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్కు సంబంధించిన సర్వర్ను అహ్మదాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.

దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

Also Read

Related posts