పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పాత నేర న్యాయ చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని..
Visakhapatnam police: కొత్త నేర న్యాయ చట్టం దేశంలో నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే విశాఖపట్నంలో ఓ రేప్ కేసులో పాత చట్టం ప్రకారం మాత్రమే చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ వివేకానంద వెల్లడించారు.
మధురవాడ మల్లయ్యపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు.
Also read :ప్రమాదమా..? నిప్పు పెట్టారా?
ఇవాల్టి నుంచి నమోదయ్యే కేసుల్లో కొత్త నేర న్యాయ చట్టం ప్రకారం శిక్షలు పడతాయని ఏసీపీ వివేకానంద తెలిపారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఘటన నిన్న జరిగింది కావున పాత చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. దర్యాప్తు తొందరగా పూర్తిచేసి నిందితుడికి 20 సంవత్సరాలు పైనే జైలుశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అత్యాచార కేసుల్లో అనేక మందికి శిక్షలు పడేలా చేశామని, మహిళలకు నిత్యం అండగా ఉంటామని భరోసాయిచ్చారు
Also read :Telangana: అర్ధరాత్రి ఘోరం.. ఇంటి మిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి దుర్మరణం..