డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు బైక్‌ను పీఎస్ తీసుకెళ్తే మనం ఏం చేస్తాం.. తర్వాతి రోజు వెళ్లి కోర్టులో ఫైన్ కట్టి బైక్‌ను తెచ్చుకుంటాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే.. మీకు ఫ్యూజులెగిరిపోతాయి. పోలీసులు తన బైక్‌ను తీసుకొచ్చారని.. ఛాలెంజ్ చేసి మరీ ఆ వ్యక్తి.. సీఐ కారును ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా వెలుగు చూసింది.
నేను మందు తగాను. నన్ను ఎందుకు నిలిపారు. నా బైక్ నాకు ఇవ్వక పోతే మీ పోలీసు వాహనం నేను ఇంటికి తీసుకుని వెళ్తా.. మీరు ఏమైన చేసుకోండి అంటూ ఏకంగా ఒక మందు బాబు తన బైక్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తే.. ఆ యువకుడు CI వాహనాన్ని తన ఇంటికి తీసుకొళ్లే ప్రత్నయం చేశాడు. ఈ విచిత్ర సంఘటన కర్నూలు జిల్లా ఆలూరు లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆలూరు మండలం పెద్దహో తురు గ్రామానికీ చెందిన యువరాజు అనే యువకుడు మందు తాగి తన బైక్ పై ఇంటికి వెళ్తూ ఆలూరు శివారులో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడ్డాడు.
దీంతో పోలీసులు యువరాజు బైక్‌ను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న యువరాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసు సిబ్బంది కళ్ళు గప్పి.. ఏకంగా CI వాహనాన్ని అతి వేగంగా డ్రైవ్ చేస్తూ తన సొంత గ్రామము వైపు వెళ్ళాడు. అదిగమనించిన పోలీసులు అతన్ను పట్టుకునేందుకు వెంట పడడంతో పోలీసు వాహనాన్ని రోడ్డుపై వదిలేసి పరారు అయ్యాడు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాసేపు అతడికోసం వెతికి అతను దొరకక పోవడంతో.. వారి కుటుంబబ సభ్యులను పీఎస్‌కు తరలించారు.
యువరాజు మందు మత్తులో చేసిన తప్పునకు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా యువరాజు చేసిన పనిని కొందరు మద్యం బాబులు కరెక్ట్ అంటుండగా.. మరికొందరు పోలీసులకు వ్యతిరేఖంగా యువరాజు చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలో సంచలనం కలిగించింది. నా బైక్ తీసుకెళ్తే మీ కారు తీసుకెళ్తాను అని పోలీసులకు తాగుబోతు ఛాలెంజ్ చేసి మరీ తీసుకెళ్లడం విచిత్రంగా ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు
Also Read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





