SGSTV NEWS
Andhra PradeshCrime

వరదలో కొట్టుకుపోయిన ముఠా కార్మికుడి మృతదేహం లభ్యం



విజయవాడ : విజయవాడ వరదలో కొట్టుకుపోయిన ముఠా కార్మికుడు పోలినాయుడు మృతదేహం లభ్యమైంది.  న్యూ రాజరాజేశ్వరి పేటలో నివసిస్తున్న కే పోలినాయుడు సెప్టెంబర్ ఒకటో తేదీన ఇంటికి వెళుతుండగా, వరద ఉధృతికి కొట్టుకుపోయారు. 15 రోజుల అనంతరం ఈరోజు మృతదేహం బయటపడింది. రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్లో పోలినాయుడు హమాలి వృత్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అప్పటినుండి పోలినాయుడు ఆచూకీ కోసం వెతుకుతున్నారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధులకు తెలిపారు. అయినా ఫలితం దొరకలేదు. ఎట్టకేలకు సమీపంలోనే చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని నేడు మృతదేహం బయటపడింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి మృతదేహాన్ని చూసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.  అధికారులతో మాట్లాడి పోస్టుమార్టం ఏర్పాట్లు చేశారు. కార్మికుడు కుటుంబాన్ని ఆదుకోవాలని, 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని బాబురావు కోరారు. కార్మిక శాఖ  కూడా స్పందించాలని, కార్మిక కుటుంబానికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts