Vijayawada : వాళ్లు ఒకే వీధిలో ఉంటారు. ఆ యువతి కాలేజీకి వెళ్తాంది. ఆమె తాత మనవరాలిని బస్సు ఎక్కించేందుకు తోడుగా వెళ్తున్నాడు. అంతలోనే అటుగా అభి అనే యువకుడు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతనితో పాటు పెంపుడు కుక్క కూడా ఉంది. వాడి జాగింగ్ ఏదో వాడు చేసుకోకుండా.. ఆ యువతిని టీజ్ చేసే ప్రయత్నం చేశారు. పెట్ డాగ్ను ఆ అమ్మాయిపైకి ఉసిగొల్పాడు. అది చూసి ఆమెతో ఉన్న తాత రామరావు మందలించాడు. ఇదేం పనంటూ అభితో గొడవ పెట్టుకున్నాడు. ఆ యువకుడు సైతం మాటకు మాట అంటూ వాగ్వాదానికి దిగాడు. కట్ చేస్తే………
విజయవాడలో స్ట్రీట్ ఫైట్
కాసేపటికే ఆ వీధిలో చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఇటు యువతి కుటుంబ సభ్యులు.. అటు యువకుడి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రోడ్డు మీదకు వచ్చారు. తమ అమ్మాయిని ఏడిపిస్తున్నారంటూ ఆమె తరపు వాళ్లు ప్రశ్నించారు. మా వాడిని అన్యాయంగా తిడుతున్నారంటూ అతడికి సపోర్ట్ గా నిలిచింది ఆ ఫ్యామిలీ. మేటర్ ముదిరింది. ఇరువర్గాలు తిట్టుకున్నారు. సడెన్గా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నా పెద్దా.. ఆడా మగా.. అంతా తలో చేయి వేశారు. దొరికిన వారు దొరికినట్టు కుమ్మేసుకున్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కానంతగా రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని లాగేశారు. బట్టలు చింపేశారు. పిడిగుద్దులు గుద్దేశారు. కాలితో తన్నుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది వరకు వీధిలో పడి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అదంతా సమీపంలోని సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫైటింగ్ ముసిశాక.. ఇరు వర్గాలు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. తన కుమార్తెను అభి ఏడిపిస్తున్నాడంటూ యువతి తండ్రి శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చారు. తనను అనవసరంగా కొట్టారంటూ అభి సైతం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాయి.
Also read
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత