Vijayawada: విజయవాడ సిటీలో ఏం జరుగుతోంది? అన్నపూర్ణ, శకుంతల థియేటర్లపై దాడులు ఎవరి పని? పాతకక్షలు పురి విప్పాయా? రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందా? అర్థరాత్రి వేళ జేసీబీలతో కూల్చడానికి కారణమేంటి? ఇంతకీ కూల్చిన వారెవరు? హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నదెవరు? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.
విజయవాడలోని గవర్నర్ పేటలో అన్నపూర్ణ, శకుంతల థియేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. మే 31న అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రపోతున్న పనివాళ్లను బెదిరించారు.
వారి వద్ద సెల్ఫోన్లను లాక్కున్నారు. వారందరినీ ఓ గదిలో బంధించారు. ప్లాన్ ప్రకారం వారు చేయాల్సిన పనులు పూర్తి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. టికెట్ కౌంటర్, క్యాంటీన్, ఆఫీసు రూము, వాష్ రూములను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలో ఆయా వ్యక్తులు విద్యుత్ నిలిపివేశారు. ఆ తర్వాత సీసీకెమెరాలను సైతం ధ్వంసం చేశారు.
థియేటర్ల బాధ్యతలను శ్రీరామ్ అనే వ్యక్తి చూస్తుంటాడు. థియేటర్లు కూల్చివేతపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే థియేటర్ మేనేజ్మెంట్లో కొందరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం వల్లే ఇదంతా చోటు చేసుకుందని అంటున్నారు. ఎంత అభిప్రాయ బేధాలున్నా థియేటర్లను కూల్చివేతకు పాల్పడరని అంటున్నారు.
దీనివెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ స్థాయిలో డ్యామేజ్ చేస్తారని తాము ఊహించలేదని అంటున్నారు. పైన చెప్పిన విషయాలను థియేటర్ ప్రతినిధి శ్రీరామ్ తెలిపాడు. మొత్తానికి థియేటర్ల ధ్వంసం వెనుక ఎవరి హస్తముందో చూడాలి.
జేసీబీలతో థియేటర్ ధ్వంసం..
విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్లలోని పలు నిర్మాణాలు ధ్వంసం
సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్లు తెలిపిన థియేటర్ యజమాని
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!