అఘోరి బాబాగా చెప్పుకుంటున్న రాజేష్ నాథ్ అనే వ్యక్తి లైంగిక వేధింపులు, మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితురాల ఒక వీడియోను రిలీజ్ చేసింది. అతనితో జరిగిన అసభ్యకర చాట్లను కూడా బయటపెడుతూ బాధితురాలు సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. రాజేష్ నాథ్ నుండి రక్షించుకోవాలని ఆమె కోరుతోంది.
ఎంత మంది దొంగ బాబాలకు శిక్షలు పడుతున్నా.. కొంతమంది ఇంకా దారికి రావడం లేదు. ఎక్కడో ఒక చోట దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా ఓ దొంగ అఘోర బాబా రాసలీలలు బయటికి వచ్చాయి. అఘోర పేరుతో రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. అతని పేరు అఘోర బాబా రాజేష్ నాథ్‌గా చెప్పుకుంటున్నాడు. తాజాగా అతను ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకర చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామని చాటింగ్లో ఉంది. అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో 2024 ఏప్రిల్ లో రాజేష్ నాథ్ వద్దకు వెళ్లింది. తన సమస్యలు చెప్పుకోని పరిష్కారం చెప్పమంటే.. నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ 20 నుంచి బాధితురాలితో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు.
చాటింగ్ లో వొంకర మాటలు మాట్లాడుతూ.. ఆ అమ్మాయి లైంగిక జీవితం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలంటూ కూడా అసభ్యంగా చాట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. అఘోర బాబా రాజేష్ నాథ్ తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది. రాజేష్ నాథ్ ని తనలా ఎవరూ మోసపోవద్దంటూ పేర్కొంది. అఘోర పేరుతో కమావంచన తీర్చుకుంటున్నాడు, చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేశాడు, అందరినీ రాజేష్ నాథ్ భారీ నుండి విడిపించండి అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కాగా బాధితురాలు రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
బాధితురాలు రిలీజ్ చేసిన వీడియో
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!