వారిద్దరి మధ్య ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు. ఏవేవో కారణాలు చెప్తూ.. రోజులు నెట్టుకుంటూ వస్తోంది. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న భర్తను లేపి.. నీకిచ్చిన కూల్ డ్రింక్‌లో విషం కలిపాను.. ఇంకాసేపట్లో నువ్వు చనిపోతావని చెప్పింది. నువ్వు చనిపోతేనే నేను నా ప్రియుడితో ఆనందంగా ఉంటానని ఓపెన్ అయిపోయింది. దీంతో కంగుతిన్న భర్త.. పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లాడు.
పెళ్లయి నెల రోజులు అయ్యిందో లేదో.. భర్తతో కాపురం ఇష్టం లేదు అంటూ అతన్ని చంపాలని చూసిందో భార్య. భర్తపై విషప్రయోగం చేసింది. జ్యూస్‌లో పాయిజన్ కలిపి ఇచ్చేసింది. ఇది తాగిన అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడులోని కడలూరులో జరిగింది ఈ దారుణం. భర్తతో కాపురం ఇష్టం లేదని ఆ మహిళ చెప్తోంది. ఇదే విషయంపై గతంలో భర్త నిలదీయడంతో వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. ఐతే..పెద్దమనుషుల పంచాయితీలో రాజీ కుదిరింది.. కానీ పంచాయితీ తర్వాత కూడా ఆమె ప్రేమాయణం కొనసాగించింది. తాజాగా జ్యూస్‌లో విషం కలిపి భర్తకు ఇచ్చింది ఆ భార్య.
కడలూరు జిల్లాకు చెందిన సుందరమూర్తికి కలైయరసన్ అనే కుమారుడు ఉన్నాడు. జనవరి 26న పెద్దలు అతనికి ఆర్తి (పేరు మార్చాం) అనే యువతితో వివాహం చేశారు. అయితే ఆర్తికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పట్టుబట్టడం వల్లే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంది. ఆమె పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆర్తి తన ప్రియుడితో వీడియో కాల్ చేయడంతో కలైయరసన్ షాక్ అయ్యాడు. కుమార్తెను మందలించమని చెప్పి అమ్మగారింటికి పంపాడు. పుట్టింటివారు మళ్లీ సర్దిచెప్పి అత్తారింటికి పంపారు. అయితే తన ప్రేమికుడితో ఎడబాటును తట్టుకోలేకపోయిన ఆర్తి.. ఫిబ్రవరి 20వ తేదీన సాఫ్ట్ డ్రింక్‌లో విషం కలిపి.. భర్త కలైయరసన్‌కు ఇచ్చింది. దీంతో అతను ఇప్పుడు చావుబ్రతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కడలూరులోని పుదుచత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆర్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలైయరసన్ తల్లిదండ్రులు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





