“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది.
“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. నన్ను రక్షించండి మహాప్రభో!” అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తల గొడవ అనుకొని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వీడియో ఆధారాలతో సహా బాధితుడు మళ్లీ పోలీస్ స్టేషనుకు వచ్చాడు. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి వీడియో తీశాడు. ఆ వీడియోలో భర్తను ఆమె హింసిస్తున్న తీరు చూశాక.. పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నౌర్ జిల్లాకు చెందిన మనన్ జైదీ, మెహర్ జహాన్ భార్యాభర్తలు. మెహర్ భర్తను నిత్యం హింసించడం అలవాటుగా చేసుకొంది. మెహర్పై కేసు నమోదు చేశామని బిజ్నౌర్ జిల్లా ఏఎస్పీ మీడియాకు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025