పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
వరంగల్: వదిన(అన్న భార్య)ను ఇద్దరు పిల్లల తల్లిని చేసి మరో పెళ్లికి సిద్ధపడ్డాడో ఓ మరిది. విషయం తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన జాటోత్ రాజుకు చెన్నారావుపేట మండలంలోని ఎల్లాయగూడేనికి చెందిన మమతను ఇచ్చి 2017లో పెళ్లి చేశారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమెకు గర్భం రావడం లేదు. చివరికి పరీక్షలు చేసిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పారు. దీంతో మమత.. భర్తతో కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.
కొద్దిరోజుల తరువాత అత్త భద్రమ్మ, మామ నర్సింహ, మరిది శ్రీనులు మమత వద్దకు వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూయిస్తామని చెప్పి కాపురానికి తీసుకువచ్చారు. కానీ ఆ దంపతులను ఆస్పతికి తీసుకెళ్లలేదు. ఈ క్రమంలో ఓ రోజు ‘నీ భర్త రాజుకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. ఈ విషయం నీకు తెలుసుకదా. నువ్వు (మరిది)శ్రీనుతో కలిసి కాపురం చేయగలిగితే నీకు పిల్లలు పుడతారు’ అని అత్తామామలు ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఆస్తిపాస్తులు మనమే అనుభవిస్తామని నమ్మబలికిన శ్రీను మమతతో కాపురం చేస్తూ వస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించింది.
ఇన్నాళ్లు గుట్టుచప్పుడుగా సాగింది. కొంతకాలంగా అత్తామామ, మరిదిలు తరచూ ఆమెతో గొడవ పడుతూ పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నా రు. 20 రోజుల క్రితం ఆమెను కొట్టి పుట్టింటికి వెళ్లగొట్టారు. అనంతరం శ్రీను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చి తార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మమత చిన్నతండాకు వచ్చి నిలదీసింది. శ్రీను.. ఆమెను దూషించి వేరే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!