UPI payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ సేవలను పొందేందుకు సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ను ఎన్పీసీఐ తీసుకొచ్చింది.
UPI payments | ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ప్లాట్ఫాక్పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ (UPI circle) పేరిట కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. డెలిగేట్ పేమెంట్స్ పేర్కొనే ఈ ఫీచర్కు సంబంధించి తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీంతో ఏవిధంగా ప్రయోజనం? లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. ఎవరి యూపీఐని వారే వినియోగించుకోవడానికి వీలుంది. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్తో అది సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబసభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట.
తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీంతో ఏవిధంగా ప్రయోజనం? లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. ఎవరి యూపీఐని వారే వినియోగించుకోవడానికి వీలుంది. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్ తో అది సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబసభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట.
ఎలా ఉపయోగం?
కుటుంబసభ్యుల్లో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారి లావాదేవీల కోసం ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చు. లేదంటే స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలకు వారి ఖర్చుల కోసం మీ యూపీఐ ఖాతాను పంచుకోవచ్చు. లేదంటే ఇంటి ఖర్చులను ట్రాక్ చేసేందుకు అందరూ ఒకటే బ్యాంక్ ఖాతాను వినియోగించడానికీ ఈ యూపీఐ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా లేనందున ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న వారిని దృష్టిలోపెట్టుకొని ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఎన్పీసీఐ పేర్కొంది. యూపీఐ యాప్స్, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ఎలా పనిచేస్తుంది? లిమిట్ ఎంత?
• యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఒక మ్యాండేట్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తన కాంటాక్టులోని నచ్చిన నంబర్ను ఎంచుకోవచ్చు.
• ఒక ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా ఐదుగురు సెకండరీ యూజర్లను ఎంచుకోవచ్చు.
• సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్ను మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది.
ఎలా పనిచేస్తుంది? లిమిట్ ఎంత?
• యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ యూపీఐ హోల్డర్ ఒక మ్యాండేట్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తన కాంటాక్టులోని నచ్చిన నంబర్ను ఎంచుకోవచ్చు.
• ఒక ప్రైమరీ యూజర్ గరిష్ఠంగా ఐదుగురు సెకండరీ యూజర్లను ఎంచుకోవచ్చు.
• సెకండరీ యూజర్ మాత్రం ఒక ప్రైమరీ యూజర్ అకౌంట్ను మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది.
• ప్రైమరీ యూజర్.. సెకండరీ యూజర్ల చెల్లింపులకు సంబంధించి నగదు, వినియోగంపై పరిమితి విధించొచ్చు.
. నెలకు గరిష్ఠంగా రూ.15వేలు వరకు వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.5 వేలు వరకు లావాదేవీలు చేయొచ్చు.
• సెకండరీ యూజర్ చేసే లావాదేవీలు ప్రైమరీ అకౌంట్ హోల్డర్ యూపీఐ యాప్, బ్యాంక్ ఖాతాలో కనిపిస్తాయి.
• చెల్లింపులకు సంబంధించి పూర్తి డెలిగేషన్ ఇస్తే.. సెకండరీ యూజర్ ఎలాంటి అవాంతరాలూ లేకుం చెల్లింపులు చేయొచ్చు.
• అదే పాక్షిక డెలిగేషన్ ఇస్తే.. సెకండరీ యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ను ప్రతిసారీ ప్రైమరీ యూజర్ ఆమోదించాల్సి ఉంటుంది.
Also read
- Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..
- AP Crime : అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి….చంద్రబాబు సీరియస్
- నేటి జాతకములు 17 జూన్, 2025
- పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
- Telangana: గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసె వేసిన రోజు కూలీ – ఆవేదనలో అర్థం ఉందండోయ్