పెద్దపల్లి డిస్ట్రిక్ట్ : చాలా మంది అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుంటారు. అంతేకాక కొన్ని సార్లు సమస్యలకు భయపడి..చావే పరిష్కార మార్గంగా భావిస్తుంటారు. అలా ఎంతో మంది యువతులు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
నేటికాలంలో మనిషిలో ఆత్మస్థైర్యం అనేది కొరవడింది. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుంటారు. అంతేకాక కొన్ని సార్లు సమస్యలకు భయపడి..చావే పరిష్కార మార్గంగా భావిస్తుంటారు. అలా ఎంతో మంది యువతులు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ 20 ఏళ్ల యువతి కూడా కొందరి వేధింపులకు తట్టుకోలేక..తల్లిదండ్రులకు శిక్ష వేసింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పెద్దపల్లి జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన మామిడి మొగిళి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక అదే గ్రామంలో హోటల్ నడిపిస్తూ, ఆటో నడుపుతూ మొగిళి జీవనం సాగిస్తున్నాడు. ఆయన చిన్న కూతురు అఖిల(20) ఇంటి వద్దే ఉంటూ ఎం.ఎల్.టీ. చదువుతుంది. ఇక ఇద్దరు బిడ్డలను ప్రయోజకులుగా చూడాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే గురువారం మొగిళి దంపతులుకు వారి చిన్న కుమార్తె షాకిచ్చింది.
గురువారం అఖిల తన తల్లితో కలిసి హోటల్ కి వెళ్లింది. అక్కడే మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి.. అనంతరం ఇంటికెళ్లింది. ఏదో పని నిమిత్తం 3.30 గంటలకు అఖిలకు ఆమె తల్లి ఫోన్ చేసింది.. అయితే అఖిల స్పందించకపోవడంతో అనుమానంతో ఇంటికెళ్లింది. ఈ క్రమంలోనే ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా అఖిల ఫ్యాన్‌కు ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. అది చూసి అఖిల తల్లి గట్టిగా కేకలు వేస్తూ బోరున విలపించింది. దీంతో ఆమె మాటలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి తలుపులను తొలగించి ఆ యువతిని కిందకు దించారు. అయితే అప్పటికే అఖిల మృతి చెందింది.
యువతి ఆత్మహత్య చేసుకున్న రూమ్ లోని ఒక పుస్తకంలో ఓ లేఖ లభించింది. అందులో…అంగోతు భరత్, అంగోతు కోటయ్య, అంగోతు విజయలు తనను ఫోన్‌లో మానసికంగా వేధిస్తున్నారని, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఏడిపిస్తున్నారని తన చావుకు వారే కారణమని రాసి ఉంది. భరత్ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండటంతో తమ కూతురు బలవన్మరణానికి తమ బిడ్డ పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ క్షణికావేశంలో అఖిల దారుణ నిర్ణయం తీసుకుని నిండు జీవితాన్ని బలి చేసుకుంది
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!