ట్యూషన్ మాస్టర్ 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి ట్యూషన్ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా కొందరు మృగంలా ప్రవర్తిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొందరు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మంచి చెప్పాల్సిన గురువులే ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి వారికి అన్ని మంచిగా చెప్పకుండా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో నైతిక విలువలు తెలిసిన గురువులు ఇలా ప్రవర్తిస్తుంటే వారు పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే మంచి, చెడు, నైతిక విలువలు, చదువు చెప్పాల్సిన గురువులు ఇలా చేస్తుంటే తల్లిదండ్రులు ట్యూషన్లు, స్కూళ్లకు పంపించడానికి కూడా భయపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా టీచర్లు ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఇలాంటి దారుణ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భోగాపురం మండలం గుడివాడలో భర్త విజయ్ కుమార్ తన భార్యతో ఉంటున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి ట్యూషన్ చెబుతుంటారు. రెండు రోజుల కిందట భార్య లేకపోవడంతో విజయ్ ఒక్కటే ట్యూషన్ చెప్పాడు. ఈ సమయంలో ట్యూషన్ మాస్టర్ విజయ్ 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో బాలిక నానమ్మ ఆరా తీయడంతో.. ట్యూషన్ మాస్టర్ తనపై తప్పుగా ప్రవర్తించాడని బాలిక తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్యూషన్ మాస్టర్‌గా ఉన్న విజయ్ ఇలా చేయడం ఇది మొదటిసారా? లేకపోతే ఇంతకు ముందు ఇలా ఎవరిపై అసభ్యంగా ప్రవర్తించాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బుర్ఖా ధరించి ఉన్న..
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి బుర్ఖా ధరించి ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుర్ఖా ధరించి నడిరోడ్డుపై వెళ్తున్న ఆ మహిళపై పట్టపగలు ఇలా చేశాడు. మార్కెట్‌కి వెళ్లి ఆ మహిళ తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ మహిళను వెనుక నుంచి పట్టుకున్నాడు. అసభ్యకరంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై టచ్ చేసి ఆ తర్వాత వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడికి పోలీసులు యోగి స్టైల్ ట్రీట్ మెంట్ అందించారు. అదిల్ అనే వ్యక్తి ఇలా చేసినట్లు 24 గంటల్లోనే గుర్తించి, బాధితరాలికి సారీ చెప్పేలా చేశారు. మహిళలను అగౌరవపరచినందుకు అదిల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ కేసులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025