కాకినాడ జిల్లా సామర్లకోట సీతారాం కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన మాధురి (26), ఆమె ఇద్దరు కుమార్తెలు నిస్సి (8), ప్రైజీ (6) దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Triple Murder Case: ఈ మధ్య కాలంలో హత్య కేసు పెరుగుతున్నాయి. మనుషులు మృగాలంటే దారుణంగా మనిషి ప్రాణాలను తీస్తున్నారు. ఎందుకు అంత కక్ష్య పెంచుకుంటున్నారో తెలియదు కానీ పసిపిల్లలు అని కూడా చూడకుండా వారి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అలాంటి దారుణం ఘటన ఇప్పుడు ఏపీలో ఒకటి జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ (triple murder ) ఘటన కలకలం సృష్టించింది. సీతారాం కాలనీలో నివాసం ఉంటున్న () ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణంగా కొట్టి చంపారు. ఈ హత్యను చూసిన స్థానికులకు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మూలపర్తి మాధురి (26), ఆమె ఇద్దరు కుమార్తెలు నిస్సి (8), ప్రైజీ (6) దారుణంగా హత్య చేశారు. నిద్రిస్తున్న సమయంలోనే దుండగులు వారి తలలపై బలంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులను.. పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఇళ్ల మధ్యలోనే ముగ్గురిపై దాడి..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితులు ఇంట్లోకి ప్రవేశించి.. నిద్రిస్తున్న తల్లీబిడ్డల తలలపై బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ హత్యలు పథకం ప్రకారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్తి తగాదాలు, వ్యక్తిగత కక్షలు (Personal factions) లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు తీవ్రతపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో (Clues Team, Dog Squad) ఘటనా స్థలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఈ కేసు దర్యాప్తులో కీలకం కానుంది. ఈ హత్యలు సామర్లకోట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటువంటి దారుణ ఘటనలు జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇలాంటి హత్యలు జరగడం చాలా దారుణమని మానవ హక్కుల సంఘం నాయకులు (Human rights leaders) అంటున్నారు. పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి హంతకుడు పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంట్లో ముగ్గురు మృతి చెందటంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న పిల్లలు ఏం చేశారని.. ఇంత దారుణ చంపారని రోదిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఈ కేసును ఛేదించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుమని పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025