సినిమాల్లో టెంపుల్స్ మిస్టరీని చేధించడానికి కార్తికేయ ఉన్నాడు. మర్డర్స్ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేయడానికి అడవి శేష్ లాంటి హీరోలూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా మిస్టరీ గురించే… మరీ ఈ మిస్టరీని చేధించడానికి ఎవరొస్తారు…? అసలా మిస్టరీ ఏంటి…?
పైన ఫోటోలో మీరు చూస్తున్న ఈ గొయ్యే మిస్టరీగా మారింది. అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది. అధికారులను తలలు పట్టుకునేలా చేస్తోంది. అదేంటి ఇంత గొయ్యికి అంత సీన్ ఉందా…? ఎవరో తీస్తేనో… ఏదో చేస్తేనే గొయ్యి పడుంటుంది..! అంతమాత్రన మిస్టరీలాంటి మాటలెందుకు అనుకోకండి. ఇది ఎవరో తీసిన గొయ్యి కాదు. ఆకాశం నుంచి ఏదో శకలం భూమ్మీద పడటంతో… ఏర్పడ్డ గొయ్యి. యస్ మీరు వింటున్నది నిజమే. అకాశం నుంచి భారీ శబ్ధం చేస్తూ… భూమ్మీద ఓ శకలం పడటంతో ఈ ఆరడుగుల గుంత ఏర్పడింది.
తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లా జోలార్‌పెటైలో ఈ గుంత పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడి జనాలకు వణికిస్తోంది. ఏదో తెలియని శక్తి భూమ్మీదకి వచ్చిందంటూ జనాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఊరికి కీడొచ్చింది… దానికి ఇదే సంకేతమంటూ తలలు పండినవారూ చెప్పడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి… అధికారుల చెవిలో పడింది. దీంతో అధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పలుమార్లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అసలేం జరిగిందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయినప్పటికీ మిస్టరీని చేధించలేకపోయారు. కలెక్టర్ సైతం ఘటనా స్థలానికి వచ్చి గొయ్యిని చూశారు. ఎవరు భయపడాల్సిన పనిలేదంటూ అక్కడి జనాలకు ధైర్యం చెప్పారు. మరోవైపు గుంతలో ఉన్న శకలానికి సంబంధించిన శాంపుల్స్‌ను అధికారులు సేకరించారు. ఆ శాంపుల్స్ ద్వారా ఈ గుంత మిస్టరీని చేధించే పనిలో పడ్దారు.
మొత్తంగా… ఈ పెద్ద గొయ్యి వ్యవహారం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఈ గొంతను విచిత్రంగా చూస్తున్నారు. రకరకల స్టోరీలు చెప్పుకుంటున్నారు. ఒకరు సైన్స్ అంటుంటే… ఇంకొకరు తెలియని శక్తంటూ మాట్లాడుకుంటున్నారు. మరి శాంపుల్స్ సేకరించిన అధికారులు ఏం తేలుస్తారో చూడాలి… ! సినిమా రేంజ్‌లో ఏమైనా ట్విస్ట్ ఇస్తారో చూడాలి.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..