April 4, 2025
SGSTV NEWS
Andhra Pradesh

సర్పాల సయ్యాట.. సాయం సంధ్య వేళలో గంటన్నర పాటు నాట్యం..



దాదాపు గంటన్నర పాటు రెండు పాములు సయ్యాట చేస్తే అలా చూస్తూ ఉండి పోవడమే స్థానికుల పనైంది. అటు, ఇటు రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ పాములను ఆసక్తిగా గమనించగా, మరి కొందరేమో దాదాపు 15 అడుగులకు పైగా పొడవు వున్న రెండు భారీ సర్పాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఇలాంటి ఘటన తిరుపతి జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగింది.

పాములను చూస్తే సాధారణంగా అందరికీ భయమే. కొంతమంది పాము పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే ఇక అంతే సంగతి. దరిదాపు ల్లోకి వెళ్ళే సాహసం కూడా చేయరు. అలాంటిది చుట్టూ ఎంతో మంది చూస్తున్నా అదేమీ పట్టనట్టు ఒకదాన్ని మరొకటి పెన వేసుకొని దాదాపు గంటన్నర పాటు రెండు పాములు సయ్యాట చేస్తే అలా చూస్తూ ఉండి పోవడమే స్థానికుల పనైంది. అటు, ఇటు రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ పాములను ఆసక్తిగా గమనించగా, మరి కొందరేమో దాదాపు 15 అడుగులకు పైగా పొడవు వున్న రెండు భారీ సర్పాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఇలాంటి ఘటన తిరుపతి జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగింది.


తిరుపతిలోని కేవీబీ పురం మండలం కలత్తూరులో ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. తన్మయంతో జతకట్టి పెనవేసుకున్న రెండు భారీ సర్పాలు నాట్యం చేస్తూ రోడ్డు పక్కనే ముళ్ళ పొదల్లో దర్శనం ఇవ్వడంతో చూడటానికి భలే ఉందని స్థానికులు ఆసక్తి చూపారు. ఇలా కలత్తూరు గ్రామంలోని పెద్ద చెరువు వద్ద పాముల సయ్యాట కనువిందు చేసింది

Also read

Related posts

Share via