జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, నవ గ్రహాలు తమ గమనాన్ని నిర్దిష్ట సమయంలో మార్చుకుంటూ ఉంటాయి. ఏప్రిల్లో సూర్యుడు, కుజుడు సహా 5 గ్రహాలు తమ గమనం మార్చుకోనున్నాయి. దీంతో కొన్ని రాశులకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. ఏప్రిల్లో 5 గ్రహాల గమనం మారుతుంది. దీంతో కొన్ని రాశులకు కష్టాలను, కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తాయి ఈ గ్రహాలు. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల, పనిలో పదోన్నతిని చూసే అవకాశం ఉంది.
వేద పంచాంగం ప్రకారం గ్రహాల సంచారానికి సంబంధించి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో శని ఉదయిస్తాడు. అదే సమయంలో గ్రహాల రాజు సూర్యుడు ఉన్నతమైన మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో పాటు ఈ రోజున ( ఏప్రిల్ 2) శుక్రుడు మీనరాశిలోకి, కుజుడు కర్కాటకరాశిలోకి ప్రవేసించనున్నాడు. ఇక్కడ బుధుడు ఉదయిస్తాడు. అందువల్ల ఏప్రిల్లో 5 గ్రహాల గమనంలో మార్పు ఉంటుంది. దీంతో కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకుని రానున్నాయి. అలాగే కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఆదాయంలో పెరుగుదల, ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం…
మకర రాశి: ఏప్రిల్ నెల ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మార్చి 29న శని మీ రాశిలోకి ప్రవేశించిన వెంటనే వీరు శని బాధల నుంచి విముక్తి పొందుతారు. అందువలన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ నెలలో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందనున్నారు. కెరీర్ లో ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సమయం ఆర్థిక పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రమోషన్లు పొందవచ్చు.
మిథున రాశి: ఈ రాశి వారికి ఏప్రిల్ నెల సానుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వీరికి విపరీతంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈసారి వీరి కెరీర్లో పురోగతి సాధించే అవకాశం పొందుతారు. పనిలో మీ కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో వీరు విదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు. దీనితో పాటు పనిని పెంచడానికి కొత్త ప్రణాళికలు రూపొందించనున్నారు. విజయం సాధిస్తారు. ఈ సమయానికి మీ పని పూర్తవుతుంది. దీనితో పాటు వీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఏప్రిల్ నెల శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుంది. మార్చి 29న శని సంచారము జరిగినందున ఈ రాశికి చెందిన వ్యక్తులు శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. ఈ సమయంలో వీరు చేపట్టిన పని పూర్తవుతుంది. దీనితో వీరికి మనశ్శాంతి లభిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. డబ్బును సంపాదించడానికి వీరికి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. వ్యాపారులకు సమయం బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకున్నవారికి ఈ సమయం శుభప్రదం. పోటీ విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. మీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలనుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి
Also read
- కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
- Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
- Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు