December 4, 2024
SGSTV NEWS
Viral

Viral Video: లిప్టులో లవర్స్ సెల్ఫీలు.. ఉహించని ఘటనతో బిత్తరపోయిన అమ్మాయి, ఏం జరిగిందంటే..!

ఈ రోజుల్లో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పెద్ద పెద్ద బంగళాలు, అపార్టమెంట్స్ దర్శనమిస్తున్నాయి. ఇక మెట్రో నగరాల్లో ఎత్తైన భవనాలు నిర్మించబడుతున్నాయి. అయితే పైకి వెళ్లేందుకు మెట్లతో పాటు లిఫ్ట్ ఫెసిటిలీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. లిఫ్ట్ లేని అపార్ట్ మెంట్ ఉండని రోజులివి. ఒక వ్యక్తి సాధారణంగా 4-5 అంతస్తుల వరకు మాత్రమే ఎక్కగలడు. అంతకు మించి మెట్లు ఎక్కాలంటే కుదరదు. అందుకే లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఘటనలు అనేకంగా వెలుగుచూశాయి. ప్రస్తుతం లిఫ్టుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.


ఈ వీడియో ఓ అమ్మాయి గేమ్ ఆడుతుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గేమ్ ఆడటంతో పాటు సెల్పీలు దిగుతుంది. అయితే తాము దిగాల్సిన చోటు రావడంతో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే లిఫ్ట్ లోపల అమ్మాయితో గేమ్ లో బిజీగా ఉంటుంది. బయటకు వచ్చే క్రమంలో ఇద్దరు కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ క్రమంలో అమ్మాయి మొబైల్ లిప్టు కింద పడిపోతోంది. ఈ ఊహించని ఘటనతో అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ చేతి అడ్డం పెట్టి లిఫ్ట్ ఆపుతాడు. లిఫ్టు కింద పడిన మొబైల్ ను చూస్తే అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్ధం కాలేదు

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @crazyclipsonly అనే IDతో షేర్ అయ్యింది. ‘ఆమె తన ఫోన్‌ను పోగొట్టుకున్న తర్వాత షాక్‌లో ఉంది’ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఒక నిమిషం 49 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా చూడగా, 20 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ‘ఆమె ఫోన్ కోసం చిన్నపిల్లాడిలా ఏడుస్తోంది’ అని కొంతమంది కామెంట్ చేయగా, ‘బహుశా ఆ ఫోన్‌తో ఆమెకు సెంటిమెంట్ ఉండవచ్చు. అందుకే బాధగా ఉంది’ అని మరికొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది జన్మలో కూడా ఈ మిస్టేక్ చేయరేమో..

Also read

Related posts

Share via