SGSTV NEWS
CrimeTelangana

డీపీ బాగుందని వెంటపడ్డాడు.. చెల్లితో పెళ్లంటే ఎగిరి గంతేశాడు.. కట్‌చేస్తే..

 

తొలుత ప్రేమ ఆ తరువాత పెళ్లి ప్రస్థావన చేశాడు. దాంతో ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్‌తో బాధితుడికి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. వారు చెప్పే తియ్య తియ్యటి మాయ మాటలన్నీ నమ్మిన నగర యువకుడు..వాళ్లు ఏం చెప్పిన నమ్మే పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం చాటింగ్స్‌ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న..

హైదరాబాద్ మహా నగరాన్ని మినీ వరల్డ్‌ అని కూడా పిలుస్తారు.. ఎందుకంటే.. ఇక్కడ వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు మాత్రమే కాదు.. అనేక దేశాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో మతాలు, అనేక బాషాలు మాట్లాడేవారు కూడా ఉంటారు. అందువల్లే ఇక్కడ మోసాలు కూడా సులువుగా జరిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. అలాంటిదే మరో ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. తాజాగా హైదరాబాద్‌ నగరంలో మాట్రిమోనియల్‌ ఫ్రాడ్‌ చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లి పేరుతో సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.21 లక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్‌మీడియా వేధికగా మాట్రిమోనియల్‌ గ్రూప్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్‌ నేరగాడు పరిచయం అయ్యాడు. ప్రొఫైల్‌ డీపీలో నటి ఫొటోను చూసిన బాధితుడు అవతలి వైపు ఉన్నది ఒక మోసగాడు అని గ్రహించలేకపోయాడు. అతన్ని పూర్తిగా నమ్మేశాడు. తొలుత ప్రేమ ఆ తరువాత పెళ్లి ప్రస్థావన చేశాడు. దాంతో ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్‌తో బాధితుడికి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. వారు చెప్పే తియ్య తియ్యటి మాయ మాటలన్నీ నమ్మిన నగర యువకుడు..వాళ్లు ఏం చెప్పిన నమ్మే పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం చాటింగ్స్‌ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. వైద్య ఖర్చుల పేరుతో రూ.21.73 లక్షలు కాజేశారు. ఉన్నదంతా పోగొట్టుకున్న తరువాత గానీ, మనోడికి మేలకువ రాలేదు..

పాపం.. సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డ బాధితుడు..వారు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ పోయాడు.. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్‌మీడియా హ్యాండిల్స్, ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు లబోదిబోమంటూ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల ఫోన్‌ నెంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this