July 1, 2024
SGSTV NEWS
CrimeTrending

తీస్మార్ ఖాన్..! బట్టబుర్ర మీద విగ్గు పెట్టుకొని దర్జాగా దొంగతనాలు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

ఓ బట్టతల దొంగ నకిలీ జుట్టు ధరించి దొంగతనాలు చేయటం పనిగా పెట్టుకున్నాడు. నకిలీ జుట్టుతో చోరీలు చేస్తూ ఎవరికీ పట్టుబడకుండా తప్పించుకు తిరగేవాడు. అలా వందలు, వేలు కాదు.. ఏకంగా రూ.62 లక్షలు దోచుకున్నాడు. లూటీ అనంతరం అతడు విమానంలో ప్రయాణించి స్వగ్రామానికి వెళ్లేవాడు. ఈ ఘరానా దొంగ ఇలా మారువేశంలో వెళ్లి పలు ప్రాంతాల్లో 22 చోరీలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని థానే క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అస్సాంకు చెందిన వేషాలు మార్చే ఈ దొంగను పట్టుకున్నారు. ఈ దొంగ బట్టతల కారణంగా ఫేక్ హెయిర్ వేసుకుని దొంగతనం చేసేవాడని, చోరీకి పాల్పడిన తర్వాత విమానంలో ఇంటికి వెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. విలువైన నగలు, నగదు మొత్తం రూ.62లక్షలు నిందితుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు.


క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, ..ముంబై, నవీ ముంబై, థానేలోని పలు ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఈ దొంగను మొయినుల్ అబ్దుల్ మాలిక్ ఇస్లామ్‌గా గుర్తించారు. ఇతను అస్సాం వాసి అని తేలింది. రూ. 62 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించాడు. నిందితుడు ఇప్పటివరకు థానే జిల్లాలో 19, నవీ ముంబైలో 2, ముంబైలో 1 మొత్తం 22 భారీ చోరీలకు పాల్పడ్డాడు. ఈ నిందితుడి తలపై వెంట్రుకలు లేవు, అతను బట్టతలతో ఉన్నాడు. దొంగతనానికి పాల్పడే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అతడు నకిలీ వెంట్రుకలతో విగ్గు వేసుకునేవాడని చెప్పారు

Also read

Related posts

Share via