April 4, 2025
SGSTV NEWS
CrimeSpiritualViral

బెంగళూరులో కుప్పకూలిన 120 అడుగుల రధం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి..



ఈదురుగాలుల ధాటికి నిన్న సాయంత్రం రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లోహిత్, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. జాతరకు తీసుకువస్తున్న దొడ్డనాగరమంగళ గ్రామ రథం చిక్కనగరమంగళ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో


కర్నాటకలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ రథం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి నిన్న సాయంత్రం రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లోహిత్, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది.


జాతరకు తీసుకువస్తున్న దొడ్డనాగరమంగళ గ్రామ రథం చిక్కనగరమంగళ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో మరణించిన వారు తమిళనాడులోని హోసూర్‌కు చెందిన రోహిత్ (26), బెంగళూరులోని కెంగేరికి చెందిన జ్యోతి (14)గా గుర్తించారు. లక్కసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి హెబ్బుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..


భారీ వర్షం, ఈదురు గాలి కారణంగానే రథం కూలిపోయినట్టుగా స్థానికులు తెలిపారు. 2024 లోనూ రాయసంద్ర గ్రామ రథం కూడా కూలిపోయింది. కానీ అప్పుడు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు

Also Read

Related posts

Share via