అకస్మాత్తుగా నది నుండి పెద్ద మొసలి వచ్చి అతనిపై దాడి చేసింది. మొసలి అతని చేతిని బలంగా పట్టుకుంది. ఆపదలో ఉన్న తండ్రిని చూసిన కొడుకు మొసలితో పోరాడాడు. మొసలి బారి నుంచి తండ్రిని విడిపించేందుకు తన చేతిని దవడల్లో పెట్టి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వెళ్లి గ్రామస్తులను సహాయం కోసం తీసుకురామ్మంటూ..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడి ధైర్యసాహసాల కథ వింటే మీకు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. కేవలం పన్నెండేళ్ల బాలుడు తన తండ్రిని కాపాడేందుకు మొసలితోనే పోరాటం చేశాడు. అయినా తండ్రిని కాపాడలేకపోయాడు. మొసలి అతన్ని ఈడ్చుకెళ్లింది. ప్రస్తుతం అతని తండ్రి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సుందర్‌బన్‌లో 12 ఏళ్ల బాలుడు తన తండ్రిని కాపాడేందుకు మొసలితో పోరాడాడు. తండ్రి కోసం ఆ బాలుడు ఏకంగా మొసలి దవడల్లో చేయి పెట్టాడు, కానీ తన తండ్రిని రక్షించలేకపోయాడు. మొసలి తన తండ్రిని నదిలోకి ఈడ్చుకెళ్లింది ఈ చిన్నారి ధైర్యసాహసాల కథ విన్నవారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అతని తండ్రి కోసం రెస్క్యూ టీమ్ వెతుకుతోంది.
సమాచారం ప్రకారం, సుందర్‌బన్ ప్రాంతంలోని సత్యదాస్‌పూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ధైర్య సాహసలు ప్రదర్శించాు.. రెండు రోజుల క్రితం పాతరప్రతిమ బ్లాక్‌కు చెందిన అబ్బాసుద్దీన్ షేక్ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు సమీపంలోని నదికి వెళ్లాడు. అతనితో పాటు తన 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అబ్బాసుద్దీన్ షేక్ నదిలో పడవతో చేపల వేటకు బయల్దేరాడు. అకస్మాత్తుగా నది నుండి పెద్ద మొసలి వచ్చి అతనిపై దాడి చేసింది. మొసలి అతని చేతిని బలంగా పట్టుకుంది. ఆపదలో ఉన్న తండ్రిని చూసిన కొడుకు మొసలితో పోరాడాడు. మొసలి బారి నుంచి తండ్రిని విడిపించేందుకు తన చేతిని దవడల్లో పెట్టి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వెళ్లి గ్రామస్తులను సహాయం కోసం తీసుకురామ్మంటూ అబ్బాస్ తన కుమారుడుకి చెప్పాడు. ఎందుకంటే, మొసలితో యుద్ధం చేయడం ఆ బాలుడికి అంత సులభం కాదని ఆ తండ్రికి తెలుసు.
మొసలి నుంచి తన తండ్రిని రక్షించలేనని అబ్బాస్ కొడుకు గ్రహించాడు. వెంటనే గ్రామానికి పరిగెత్తాడు. గ్రామస్తులను వెంటపెట్టుకుని మొసలి తన తండ్రిని పట్టుకున్న ప్రదేశానికి తిరిగి వచ్చాడు. కానీ, అక్కడ తన తండ్రికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించాలేదు. అప్పటికే ఆ మొసలి తన తండ్రిని నదిలోకి లాక్కేళ్లింది. తండ్రి ఆచూకీ లభించకపోడంతో ఆ బాలుడితో పాటు వారి కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు
బాలుడు ఏడుస్తూనే తన తండ్రికి జరిగిన ప్రమాదం గురించి చెప్పసాగాడు. ప్రస్తుతం స్పీడ్ బోట్ సహాయంతో అబ్బాస్ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Also read :
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం