November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshTrending

AP News: అమ్మబాబోయ్.! ఇంటి ప్రహరీ గోడకు పెద్ద కన్నం.. కనిపించింది చూడగా కళ్లు తేలేశాడు

సాధారణంగా పాములను ఆమడదూరం నుంచి చూస్తూనే చాలామంది హడలెత్తిపోతారు. ఇక దగ్గరగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా.? దెబ్బకు అక్కడ నుంచి పరుగులు తీస్తారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పాములు తరచుగా కనిపిస్తున్నాయి. తమ ఆవాసాల్లో కాకుండా.. జనావాసాల్లో దర్శనమిస్తున్నాయ్. ఇక ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా పాములు ఓ ఇంట్లో కనిపించాయి. వింటుంటేనే గుండె జల్లుమంటోంది కదూ.! ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని ఓ ఇంట్లో 100కుపైగా పాములు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రజిని అనే మహిళ ఇంటి ప్రహరీకి భారీ కన్నం పడింది. ఆ కన్నం లోపల వరకూ పాములు చేరాయి. కుప్పలు తెప్పలుగా ఉన్న పాములను చూసి సదరు మహిళ, ఆమె కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. ఆ పాములను అక్కడ నుంచి తరిమికొట్టారు స్థానికులు. దీంతో రజినీ, ఆమె కుటుంబసభ్యులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ఇంకా ఏపీలో అక్కడక్కడా వర్షాలు పడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో పాములు ఇళ్లలోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంది. కార్లు, బైకులు.. ఇలా దొరికిన అన్నింటిలోకి పాములు చేరవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఇంటిలో ఎక్కడైనా చిన్న చిన్న రంద్రాలను ఉన్నా.. మూసివేసిలా చూసుకోండి. ఇంట్లో ఎలుకలు కూడా ఎక్కువగా తిరగకుండా చూసుకోండి. ఈ జాగ్రత్తల ద్వారా పాములను ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

Also read

Related posts

Share via