ఒడిశా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లడంతో లైంగికంగా వేధించి వీడియో రికార్డింగ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు 139కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువగా లైంగిక వేధింపుకు గురవుతున్నారు. ఒక్క నిమిషం అయినా ఆడపిల్లలను ఒంటరిగా విడిచి పెట్టడానికి భయపడుతున్నారు. స్కూల్, కాలేజీ, రైలు, బస్సు ఇలా ప్రతీ దగ్గర అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవల ప్రయాణిస్తున్న రైలులో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ వెళ్తున్నాడు.
వాష్ రూమ్‌కి వెళ్లిన సమయంలో..
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అర్థరాత్రి 2 గంటలకు పెద్ద కూతురు (12) వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెనుక వెళ్లిన ఓ వ్యక్తి ఒక అరగంట పాటు ఆమెను బంధించి వేధించాడు. వాటిని మొబైల్ ఫోన్‌లో కూడా చిత్రీకరించాడు. అతను వదిలిపెట్టిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫోన్ చేసి కంప్లైట్ చేశారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది.
Also Read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025