కర్నూలు: మంత్రాలయం క్షేత్రంలో ఓ కర్ణాటక భక్తురాలుఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రం చామారాజానగర్ జిల్లా మల్వల్లి గ్రామానికి చెందిన జయశీల (40), ఆమె అన్న, వదినతో కలసి బుధవారం మంత్రాలయం చేరుకున్నారు. స్వామిని దర్శించుకున్న తర్వాత మఠం గదిలో వసతి పొందారు. తన ఆరోగ్యం సరిగా బాగా లేనందున సేవ చేసేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని ఇంటి వద్ద ఉన్న భర్త మహేశప్ప, కుమార్తె లావణ్యకు తెలిపింది.
అదే రోజు ఆమె అన్న తిరిగివెళ్లగా, ఆమెకు తోడుగా ఉన్న వదిన శుక్రవారం వెళ్లిపోయింది. కాగా రెండు రోజులు క్షేత్రంలో ఒంటరిగా ఉన్న జయశీల ఆదివారం మధ్యాహ్నం కుమార్తెకు ఫోన్ చేసి ‘ఆరోగ్యం సహకరించడం లేదని, తాను చని పోతున్నట్లు’ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే లావణ్య మంత్రాలయం పోలీసులకు విషయం చెప్పగా.. సాంకేతిక పరిజ్ఞానంతో నది సమీపంలో ఆంజనేయ స్వామి గుండ్లు ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆమె నీటిలో శవమై కనిపించడంతో కుటుంబీకులు విషయం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మురళీధర్‌రెడ్డి తెలిపారు.
Also read
- సైన్స్ కు సైతం అంతుచిక్కని పవర్ ఫుల్ శక్తిపీఠాలు.. !!
- Astrology: శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నాయుడుపేటలో యువకుడి దారుణహత్య
- కుమార్తెకు ఫోన్ చేసిన కాసేపటికే విషాదం





