టి. నరసాపురం: విహారయాత్రకు వెళ్తున్న విద్యార్ధుల కారు ప్రమాదానికి గురై విద్యార్ధి మృతి చెందాడు. భద్రాచలం వెళ్తున్న విద్యార్దుల కారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి దగ్గర అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 8 మంది విద్యార్థులు భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు కారులో బయలుదేరారు. మారుతి డిజైర్ కారులో తాడేపల్లిగూడెం నుండి జంగారెడ్డిగూడెం మీదుగా భద్రాచలం వెళుతుండగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి – లక్ష్మి పురం మద్యలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో కోమటి స్వామి(18) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలు కాగ, ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతి చెందిన యువకుడిది టి నర్సాపురం మండలంలోని మెట్టగూడెం గ్రామంగా గుర్తించారు. గ్రామానికి చెందిన కోమటి జయరాజు, హేమలత దంపతుల కుమారుడైన స్వామి తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..