సూర్యాపేట జిల్లా మంగళితండాలో మద్యం తాగిన ప్రభుత్వ టీచర్ సిగరెట్ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. మత్తులో దాన్ని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకొన్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి ఎస్జీటీ టీచర్ ధారావత్ బాలాజీ(52) మృతి చెందాడు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగిన ప్రభుత్వ టిచర్ సిగరెట్ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. మత్తులో ఉన్న అతను దాన్ని ఆర్పివేయకుండా అలాగే నిద్రలోకి జారుకొన్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి చిటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై ఎస్సై అనిల్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళితండాకు చెందిన ధారావత్ బాలాజీ(52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నారు
ప్రాణం తీసిన సిగరెట్..
ఆదివారం శ్రీరామ నవమి పండగ కావడంతో భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లారు. సింగిల్‌గా ఉన్న ఉపాధ్యాయుడు బాలాజీ మద్యం తాగి సిగరెట్ తాగుతూ ఇంటి వరండాలోని మంచంపై పడుకున్నారు. అలాగే కొద్దీసేపటి నిద్రలోకి జారుకోగా.. సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. మరో పక్క కూలర్ గాలి తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇంటి చుట్టు పక్కన ఎవరూ లేకపోవడం, బాలాజీ మత్తులో ఉండటంతో మంటలు అంటుకుని సజీవ దహనమయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు
Also read
- నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
- హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
- Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!