మేషం (25 నవంబర్, 2024)
ఒక పరిమితిని మించి అలిసిపోకండి. సరియైన, తగిన విశ్రాంతి తీసుకోవడం మరచిపోకండి. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, మీ కుటుంబానికి మాటలలోనో, రాతలలోనో మాటలు లేకుండానో సందేశాలు పంపించడం ద్వారా, వారిపట్ల మీరెంత జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచెయ్యండి. వారి సంతోషాన్ని రెట్టింపు చెయ్యడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. సన జీవితం కంటె మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
లక్కీ సంఖ్య: 2
వృషభం (25 నవంబర్, 2024)
ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. మీ విలువైన కాలాన్ని మీపిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. పని వత్తిడి, మీ మనసును ఆక్రమించుకున్నాగానీ, మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
లక్కీ సంఖ్య: 1
మిథునం (25 నవంబర్, 2024)
మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. ఈరోజులు,ఈరాశిలోఉన్ననిరుద్యోగులకు ఉద్యోగాలులభిస్తాయి,వారియొక్క ఆర్థికస్థితి కుదుటపడుతుంది. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీయొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు.దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (25 నవంబర్, 2024)
ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీకుఈరోజు ధననష్టం సంభవించవచ్చును,కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ఏ విధమైన వ్యాపార/లీగల్ సంబంధ పత్రమైనా, పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తననుతాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో, రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు.
లక్కీ సంఖ్య: 3
సింహం (25 నవంబర్, 2024)
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతిఒక్కరినీ రిలాక్స్ అయేలాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది, మీ సాన్నిధ్యమే. పనిచేసేచోట, తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీయొక్క తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి.వారితో గడపటంవలన మీరు ఏమిపోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.
లక్కీ సంఖ్య: 1
కన్య (25 నవంబర్, 2024)
మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీరు పరపతిగల వారి చుట్టూ తిరిగితే, బాగా ఎదగ గలుగుతారు. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును. ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే.
లక్కీ సంఖ్య: 8
తుల (25 నవంబర్, 2024)
ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమలో మీ కఠినత్వానికి, క్షమాపణ చెప్పండి మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. మీకు పనిపట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం, మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలాకాలంగా ఇబ్బంది పెడుతోంది.కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి.
లక్కీ సంఖ్య: 2
వృశ్చిక (25 నవంబర్, 2024)
అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీరు మరీ ఉదారంగా ఉంటే, మీకు బాగా దగ్గరివారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును- మీచెప్పైనావిషయము మీప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది.వారి మీపై కోపగించుకోకుండా మీరు మీతప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.
లక్కీ సంఖ్య: 4
ధనుస్సు (25 నవంబర్, 2024)
మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో, మీ నిరంతర సానుకూలత ప్రశంసించ బడుతుంది. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీప్రేమ మరింత దృఢంగా,ఆనందమగా ఉండాలిఅనుకుంటే మూడోవ్య్తక్తి మాటలను నమ్మవద్దు. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది.రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు.రోజు చివర్లో, మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు.ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు.
లక్కీ సంఖ్య: 1
మకరం (25 నవంబర్, 2024)
ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీరివాళ, ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను/ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు.
లక్కీ సంఖ్య: 1
కుంభం (25 నవంబర్, 2024)
ఇంటివద్ద టేన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరిఇరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకొండి. అలాగ ఉద్రేకభరిత పరిస్థితిని వదిలెయ్యడమే మంచిది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీపిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మీరు చాలా పేరుపొందుతారు, వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్ష్స్తారు. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. మీకుదగ్గరైనవారితో మిసమయాన్ని గడపాలి అనుకుంటారు.కానీ,మీరు చేయలేరు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు.
లక్కీ సంఖ్య: 7
మీన (25 నవంబర్, 2024)
తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. ఒక వయసు మీరిన వ్యక్తికి తన సమస్యా పరిష్కారంలో మీ రు శ్రమతీసుకున్నందుకుగాను మీకు ఆయన దీవెనలు అందుతాయి. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. ఒంటరిగా సమయము గడపటంమంచిది.కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవముఉన్నవారిని సంప్రదించి వారితోమిసమస్యలను చెప్పుక్కోండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.
లక్కీ సంఖ్య: 5
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.