November 22, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 25 ఏప్రిల్, 2024

మేషం (25 ఏప్రిల్, 2024)

మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్నిసంపాదించగలరు,దీనికి కావాల్సింది మీమీద మాకునమ్మకము. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను, మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. అలాగే కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది ఘోరతప్పిదాలను చేసేలాగ చేయగలదని గ్రహించండి. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఈరోజు మీరు బంధాలయొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.మీరు సాధ్యమైంతవరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు.

లక్కీ సంఖ్య: 2

వృషభం (25 ఏప్రిల్, 2024)

జీవితంపట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మీకు మీరు గారాబం చేసుకోవడానికి / పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్పరోజు. చాలాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి, కుతూహలాన్ని కలిగించేలాగ- మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 1

మిథునం (25 ఏప్రిల్, 2024)

కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కనీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానీయండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనుంది. జీవితం ఆనందంగా ఉండటానికి మీస్నేహితులతోకల్సి సమయాన్ని గడపాలి.లేనిచో మీరుఇబ్బందుల్లోఉన్నపుడు ఎవరు మిమ్ములను రక్షించడానికిరారు. చాలాకాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే, ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి.

లక్కీ సంఖ్య: 8

కర్కాటకం (25 ఏప్రిల్, 2024)

ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పిల్లలు మీ ఇంటిపనులు పూర్తి చేయడంలో సహాయంచేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చెయ్యడానికి ప్రోత్సహించండి. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి.మీ కఠినమైన మాటలు శాంతికి భంగంకలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 3

సింహం (25 ఏప్రిల్, 2024)

మీలో కొంతమంది, శక్తిలేని మీతో- ఆలస్యంగా ఓవర్- టైమ్ చేస్తున్నారు, ఆఖరుగా మీరు వినాల్సినదేమంటే, ఈ రోజంతా వత్తిడి , సందిగ్ధత మిగిలే రోజు. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీప్రేయసిని మీరు వివాహముచేసుకోదలచిన ఈరోజు మీరు వారితో మాట్లాడండి.,అయినప్పటికీ వారు మీచేయిపట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకూ అసాధ్యమేమీ లేదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.

లక్కీ సంఖ్య: 1

కన్య (25 ఏప్రిల్, 2024)

బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు, లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తననుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు.

లక్కీ సంఖ్య: 8

తుల (25 ఏప్రిల్, 2024)

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. ప్రేమ విషయంలో బానిసలాగ ఉండకండి. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ పాడు కావచ్చు. అయినా సరే, ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది.

లక్కీ సంఖ్య: 2

వృశ్చిక (25 ఏప్రిల్, 2024)

బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును,దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈరాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (25 ఏప్రిల్, 2024)

ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీకు తెలియనివారినుండి ధనాన్ని సంపాదిస్తారు.దీనివలన మీయొక్క ఆర్ధికసమస్యలు తొలగిపోతాయి. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. కొన్ని అనివార్య కారణములవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురిఅవుతారు,దానిగురించి ఆలోచించి సమయాన్ని వృధాచేస్తారు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి.

లక్కీ సంఖ్య: 1

మకరం (25 ఏప్రిల్, 2024)

రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి, దయా, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చెయ్యండి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో,వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వివాదానికి దిగుతారు. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, క్న్ని క్రొత్త కాంటాక్ట్ లని క్రొత్త పరిచయాలను, పెంచుకొండి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.

లక్కీ సంఖ్య: 1

కుంభం (25 ఏప్రిల్, 2024)

మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ఈరోజు మీప్రేమకథ అనుకోని మలుపుతిరుగుతుంది.మీప్రియమైనవారు మీతో వివాహానికి సిద్దపడి మీతో మాట్లాడతారు.మీరు నిర్ణయము తీసుకునేముందు అన్నిఆలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు.

లక్కీ సంఖ్య: 7

మీన (25 ఏప్రిల్, 2024)

ఒళ్ళునొప్పులు, వత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపుచేసుకోవాలి, లేకపోతే, అదే మీమధ్యన అవరోధం సృష్టిస్తుంది. రొమాన్స్ కి మంచి రోజు,- సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చెయ్యండి, అలాగే దానిని, వీలైనంత రొమాంటిక్ గా ఉండేలాగ చెయ్యండి. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

లక్కీ సంఖ్య: 5

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via